తనతో శృంగారానికి ఒప్పుకోలేదని భర్తను క్రూరంగా చంపిన భార్యకు మంగళవారం అహ్మదాబాద్ సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించింది.
అహ్మదాబాద్: తనతో శృంగారానికి ఒప్పుకోలేదని భర్తను క్రూరంగా చంపిన భార్యకు మంగళవారం అహ్మదాబాద్ సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించింది. శారదానగర్ ప్రాంతంలోని నోబెల్ నగర్ లో నర్సింగ్, విమల(54) దంపతులు నివసించేవారు. 2013లో నవంబర్ 2 న భర్త తనతో శృంగారంలో పాల్గొనలేదని విమల తీవ్రంగా కొట్టింది. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావంటూ ఆయన్ను దూషించింది. కర్రతో భర్త తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇంటికి తాళం వేసి శారదానగర్ పోలీసు స్టేషన్ కు వెళ్లిన ఆమె భర్త చనిపోయాడంటూ ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని విమలను విచారించగా తానే భర్తను చంపినట్లు తెలిపింది. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు చార్జ్ షీటును దాఖలు చేశారు. దాదాపు రెండున్నరేళ్ల పాటు సాగిన విచారణ అనంతరం సెషన్స్ కోర్టు విమలకు జీవితఖైదు, రెండు వేల రూపాయల జరిమానాను విధిస్తూ తీర్పునిచ్చింది.