breaking news
killed husband
-
ప్రియుడి చేత భర్తను చంపించిన భార్య
సాక్షి, గుంటూరు : మాచర్లలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం వద్దన్నందుకు ఆదిలక్ష్మి అనే మహిళ ప్రియుడితో కలిసి తన భర్తను చంపించింది. ఇందుకోసం తన చెల్లెలి కుమారుడి సహాయం తీసుకుంది. తర్వాత ఎవరికీ తెలియకుండా శవాన్ని డంపింగ్ యార్డులో పడేసింది. ఈ ఘటనను విచారించిన పోలీసులు భార్య పాత్రను నిర్ధారించారు. ఆదిలక్ష్మిని, ఆమె ప్రియుడు కరీముల్లాను అదుపులోకి తీసుకున్నారు. -
ప్రియుడితో కలిసి.. భర్తను కడతేర్చి
సాక్షి, మదనాపురం (కొత్తకోట): వారిద్దరు ప్రేమించుకొని.. పెద్దలను ఎదిరించి.. ముక్కోటి దేవతల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు.. తొమ్మిదేళ్లపాటు సంసార జీవితం సాఫీగా సాగింది.. వీరి అన్యోన్య జీవితానికి ప్రతిరూపంగా ఇద్దరు కుమారులు, ఓ కూతురు జన్మించారు.. అయితే వీరి సంతోషం ఎంతో కాలంగా నిలవలేదు.. వివాహేతర సంబంధం వారి పచ్చని సంసారాన్ని ఛిద్రం చేసింది. నూరేళ్లు నీతో ఉంటానని చేసిన బాసలు చెదిరిపోయాయి.. భర్తకు ప్రేమతో అన్నం పెట్టిన చేతులతోనే.. ప్రియుడితో కలిసి గొంతుకు ఉరితాడు బిగించిన సంఘటన మండలంలోని గోపన్‌పేటలో చోటుచేసుకుంది. వివరాలిలా.. గ్రామానికి చెందిన ఆంజనేయులు(31) టిప్పర్ డ్రైవర్. జీవనోపాధి నిమిత్తం 2009లో హైదరాబాద్ వెళ్లాడు. అక్కడే కూలీ పనుల కోసం వచ్చిన మక్తల్ మండలం భగవాన్‌పల్లికి చెందిన సుహాసిని పరిచయమైంది. వారిద్దరి పరిచయం ప్రేమగా మారి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. వీరికి వీరికి శివ, అఖిల్, రోజా అనే పిల్లలు ఉన్నారు. టిప్పర్ యజమానితో.. భార్య ముగ్గురు పిల్లలతో కలిసి ఆంజనేయులు హైదరాబాద్‌లోని చందనగర్‌లో రమేష్ అనే టిప్పర్ యజమానితో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సుహాసిని టిప్పర్ యజమాని రమేష్‌తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. దీనిని గమనించి భర్త మద్యం తాగి భార్యను వేధింపులకు గురిచేసేవాడు. దీంతో ఎలాగైనా భర్తను తుదముట్టించాలన్న ఆలోచనతో సుహాసిని ప్రియుడు రమేష్‌తో కలిసి పథకం రచించింది. సోమవారం అర్ధరాత్రి ఇంట్లో ఇద్దరూ కలిసి ఆంజనేయులు గొంతుకు టవల్‌తో ఉరివేసి చంపేశారు. ఈ విషయం ఎక్కడా బయటపడకుండా జాగ్రత్తపడ్డారు. మంగళవారం సాయంత్రం ప్రియుడి సహకారంతో ఓ కారులో శవాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి కల్లు తాగి కిందపడి చనిపోయాడని గ్రామస్తులు, కుటుంబ సభ్యులను నమ్మించారు. అయితే ఆంజనేయులు మెడ చుట్టూ గాయాలు ఉండటం.. ఆమె మాటలు పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరికి దిక్కెవరు? తండ్రి చనిపోవడం.. తల్లి కటకటాల పాలు కావడంతో ఇద్దరు మగ పిల్లలు, ఒక కూతురు అనాథలుగా మిగిలారు. వారి అమాయకపు చూపులు.. ప్రతిఒక్కరి చేత కంటతడి పెట్టించాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అరగంటలోపే ఛేదించిన పోలీసులు .. ఫిర్యాదు అందిన వెంటనే ఆత్మకూర్ సీఐ శంకర్, మదనాపురం ఎస్ఐ సైదయ్య ఆధ్వర్యంలో గ్రామానికి వచ్చి శవాన్ని పరిశీలించారు. భార్య సుహాసిని అదుపులోకి తీసుకొని విచారించారు. భర్త రోజూ మద్యం తాగి వేధించేవాడని దీనిని తట్టుకోలేక ప్రియుడితో కలిసి చంపినట్లు వెల్లడించిందని పోలీసులు తెలిపారు. సీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సంఘటన జరిగిన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ మేరకు సుహాసిని, ప్రియుడు రమేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
భర్తపై పాములు వేసినా చావలేదని..
కోయంబత్తూర్: తన ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హతమార్చింది. తొలి ప్రయత్నంలో పాముల ద్వారా కాటు వేయించాలని ప్రయత్నించి అది విఫలం కావడంతో సుఫారీ ఇచ్చి అతడిని హత్య చేయించింది. ఈ ఘటన తమిళనాడులోని పట్టనంపుదూర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళకు కృష్ణ అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉంది. వారిద్దరు ఎలాగైనా ఆమె భర్తను హత్య చేయాలని అనుకున్నారు. తొలుత భర్త పడగ గదిలోకి పామును విడిచిపెట్టగా అది కాటువేయకుండానే బయటకు వెళ్లిపోయింది. దీంతో ఎల్ సుందర్ అనే వ్యక్తికి హత్య చేసే పని అప్పగించారు. తొలుత 15వేలు చేతికి ఇచ్చి అనంతరం రూ.ఐదు లక్షలుపెట్టి జిమ్ ఏర్పాటుచేయిస్తామని హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే సుందర్ అనే వ్యక్తి ఆమె భర్త శక్తివేల్‌ను పెద్దపెద్ద కర్రలతో కొట్టి చంపి ఓ చెత్తకుప్పలో పడేశారు. -
భర్తను చంపిన భార్యకు జీవితఖైదు
అహ్మదాబాద్: తనతో శృంగారానికి ఒప్పుకోలేదని భర్తను క్రూరంగా చంపిన భార్యకు మంగళవారం అహ్మదాబాద్ సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించింది. శారదానగర్ ప్రాంతంలోని నోబెల్ నగర్ లో నర్సింగ్, విమల(54) దంపతులు నివసించేవారు. 2013లో నవంబర్ 2 న భర్త తనతో శృంగారంలో పాల్గొనలేదని విమల తీవ్రంగా కొట్టింది. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావంటూ ఆయన్ను దూషించింది. కర్రతో భర్త తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటికి తాళం వేసి శారదానగర్ పోలీసు స్టేషన్ కు వెళ్లిన ఆమె భర్త చనిపోయాడంటూ ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని విమలను విచారించగా తానే భర్తను చంపినట్లు తెలిపింది. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు చార్జ్ షీటును దాఖలు చేశారు. దాదాపు రెండున్నరేళ్ల పాటు సాగిన విచారణ అనంతరం సెషన్స్ కోర్టు విమలకు జీవితఖైదు, రెండు వేల రూపాయల జరిమానాను విధిస్తూ తీర్పునిచ్చింది.