కాంగ్రెస్ పార్టీ ఉత్తర ప్రదేశ్ సీఎం అభ్యర్థిగా షీలా దీక్షిత్ ను అధికారికంగా ప్రకటించనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఆమెకు సమన్లు జారీ చేసింది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉత్తర ప్రదేశ్ సీఎం అభ్యర్థిగా షీలా దీక్షిత్ ను అధికారికంగా ప్రకటించనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఆమెకు సమన్లు జారీ చేసింది. కోట్లాది రూపాయల వాటర్ ట్యాంక్ కుంభకోణంలో షీలాకు నోటీసులు జారీ చేశామని, ఆమెను ఆగస్టు 26న తమ ఎదుట హాజరు కావాల్సిందిగా కోరామని ఏసీబీ చీఫ్ ఎమ్ కే మీనా తెలిపారు. దీనిపై స్పందించిన షీలా ఏసీబీ నుంచి తనకు నోటీసులు అందాయని ధృవీకరించారు.
షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో వాటర్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు. ఆ సమయంలో ఢిల్లీ వాటర్ బోర్డులో అవినీతి చోటు చేసుకుంది. దీనిపై ఆమ్ ఆద్మీ సర్కార్ విచారణకు ఆదేశించింది. ఈ క్రమం లోనే ఆమెను విచారించేందుకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది.