గ్యాస్‌ లీకేజీ : కేంద్రం ప్రత్యేక కమిటీ ఏర్పాటు

Vizag Gas Leakage : Central Govt Appointed A Special Committee - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. కేబినెట్‌ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, కెమికల్‌ మినిస్ట్రీ కార్యదర్శిలతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. గ్యాస్‌ లీకేజీ ఘటనపై గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ , మంత్రులు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, కిషన్‌ రెడ్డి, కేబినెట్‌ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, కెమికల్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్యాస్‌ లీకేజీ ఘటనకు దారి తీసిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం​ ఈ ఘటనపై ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గ్యాస్‌ ప్రభావం తగ్గింపు, బాధితులకు సహాయంపై ఈ కమిటీ చర్యలు తీసుకోనుంది. (చదవండి : విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం)

మరోవైపు గ్యాస్‌ లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ ట్విటర్‌ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై కేంద్ర హోమంత్రిత్వ శాఖ, జాతీయ విపత్తు నివారణశాఖా అధికారులతో మాట్లాడానని మోదీ తెలిపారు. బాధితులను ఆదుకునేలా వెంటనే సహాయ చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించినట్లు ప్రధాని పేర్కొన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నామన్నారు. గ్యాస్‌ లీకేజీ ఘటనలో అస్వస్థకు గురైన వారు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ ట్వీట్‌ చేశారు.

(చదవండి : గ్యాస్‌ లీక్‌ బాధితులను పరామర్శించిన సీఎం జగన్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top