ఈ ఏడాది వైద్య విద్య కోర్సుల్లో చేరేందుకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష(నీట్)నిర్వహించడం ఆచరణ సాధ్యం కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.
న్యూఢిల్లీ: ఈ ఏడాది వైద్య విద్య కోర్సుల్లో చేరేందుకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష(నీట్)నిర్వహించడం ఆచరణ సాధ్యం కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. నీట్ రద్దుపై తీర్పును సుప్రీంకోర్టు వాపసు తీసుకున్న నేపథ్యంలో.. ఇప్పటికే ప్రవేశపరీక్షలు ప్రారంభమయ్యాయని, ఒకట్రెండు పరీక్షలు అప్పుడే పూర్తయ్యాయని కేంద్రం తెలిపింది.
ప్రతిఏటా మేలో నిర్వహించే ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్(పీఎంటీ)నూ మే నెల తొలి వారంలో నిర్వహిస్తామని చెప్పింది. అందువల్ల ఆచరణలో నీట్ పరీక్ష నిర్వహణ సాధ్యం కాదని పేర్కొంది.నీట్(నేషనల్ ఎలిజబులిటీ-ఎంట్రన్స్ టెస్ట్)పై జులై 18, 2013న ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు వాపసు సోమవారం వాపసు తీసుకోవడం తెలిసిందే.