కేరళలో శ్రీలంక పేలుళ్ల ప్రకంపనలు

IS Suspect Admitted During Interrogation That He Had Plans To Carry Out Attacks In India  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేరళలో ఆత్మాహుతి దాడికి కుట్రపన్ని సోమవారం ఎన్‌ఐఏ చేతికి చిక్కిన 29 ఏళ్ల ఐఎస్‌ ఉగ్రవాది రియాజ్‌ విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. తాను ఏడాదిగా శ్రీలంకకు చెందిన జహ్రన్‌ హషీం, జకీర్‌ నాయక్‌ల ప్రసంగాలు, వీడియోలను ఫాలో అవుతున్నానని, కేరళలో ఆత్మాహుతి దాడిని చేపట్టాలని భావించానని విచారణలో రియాజ్‌ వెల్లడించినట్టు ఎన్‌ఐఏ పేర్కొంది. శ్రీలంక బాంబు పేలుళ్ల సూత్రధారి హషీం ప్రసంగాలతో తాను స్ఫూర్తి పొందానని రియాజ్‌ చెప్పాడు.

మరోవైపు ఐఎస్‌ ఆపరేటివ్‌ అబ్దుల్‌ రషీద్‌ అబ్దుల్లాతో కూడా తాను సంప్రదింపులు జరిపానని కేరళలోని పలక్కాడ్‌ జిల్లాకు చెందిన రియాజ్‌ వెల్లడించాడు. సిరియాకు చెందిన మరో ఐఎస్‌ అనుమానిత ఉగ్రవాది అబు ఖలీద్‌తో తాను ఆన్‌లైన్‌ చాట్‌ చేసినట్టు నిందితుడు తెలిపాడు. కాగా రియాజ్‌ను మంగళవారం కొచిన్‌లోని ఎన్‌ఐఏ కోర్టు ఎదట హాజరుపరచనున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top