నేపాల్ చేరుకున్న సుష్మాస్వరాజ్ | Sushma Swaraj arrives in Nepal for Saarc meeting | Sakshi
Sakshi News home page

నేపాల్ చేరుకున్న సుష్మాస్వరాజ్

Mar 16 2016 6:22 PM | Updated on Sep 3 2017 7:54 PM

సార్క్ సమావేశాల కోసం భారత విదేశ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ బుధవారం నేపాల్ చేరుకున్నారు.

న్యూఢిల్లీ : సార్క్ సమావేశాల కోసం భారత విదేశ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ బుధవారం నేపాల్ చేరుకున్నారు. రేపటి నుంచి నేపాల్ లో జరగనున్న విదేశాంగ మంత్రుల స్థాయి సార్క్ సమావేశంలో ఆమె పాల్గొననున్నారు.  సుష్మా నేపాల్ లోని పొఖారా చేరుకున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ ఓ ట్వీట్ లో తెలిపారు.  

మరోవైపు సార్క్ సమావేశాల సందర్భంలో పాకిస్తాన్ విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ తో  సుష్మాస్వరాజ్ సమావేశం అయ్యే అవకాశం ఉందని పాకిస్తానీ మీడియా ఓ ప్రకటనలో తెలిపింది. పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి కారణంగా వాయిదాపడిన  ఇండియా, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలపై  సుష్మా, అజీజ్ లు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement