arrives
-
కటక్ నుంచి అహ్మదాబాద్‌కు టీమిండియా క్రికెటర్ల పయనం (ఫొటోలు)
-
నెలల చిన్నారితో అసెంబ్లీకి వచ్చిన మహిళా ఎమ్మెల్యే
-
వియత్నాంలో పర్యటిస్తున్న విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్
-
ఆస్ట్రేలియా ప్రధాని భారత్‌లో పర్యటన
-
బడ్జెట్ ఫ్రెండ్లీ కూల్ ప్యాడ్ నోట్ 5 వచ్చేసింది
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ కూల్ ప్యాడ్ మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. కూల్ ప్యాడ్ నోట్ లతో మార్కెట్లో హల్ చల్ చేస్తున్న సంస్థ ఈ సిరీస్ లో ఇపుడు 'కూల్ ప్యాడ్ నోట్ 5'ను విడుదల చేసింది. ఈ 4 జీ ఎనేబుల్డ్ స్మార్ట్ ఫోన్ ధరను రూ.10,999 గా కంపెనీ నిర్ణయించింది. తక్కువ వెలుగులోకూడా మంచి ఫోటోల అనుభవాన్ని మిగిల్చే తమ తాజా డివైస్ ను అమెజాన్ ద్వారా అక్టోబర్ 18 ఓపెన్ సేల్ అందుబాటులో ఉంచినట్టు కంపెనీ తెలిపింది.భారతీయ మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కూల్ ప్యాడ్ నోట్ 5 లాంచ్ చేయడం సంతోషంగాఉందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ లువో జాంగ్ షెంగ్ విలేకరులకు తెలిపారు. ప్రస్తుత పోటీ మార్కెట్లో అత్యధికంగా విక్రయిస్తున్న ఫోన్లలో ఇది కూడా ఒకటన్నారు. 'కూల్ ప్యాడ్ నోట్ 5' ఫీచర్లు 5.5 అంగుళాల డిస్ ప్లే క్వాల్కం ఎస్డీ 617 ఆక్టాకోర్ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ 64 జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ ఈడీ ఫ్లాష్, 13ఎంపీ వెనుక కెమెరా, విత్ ఎల్ ఈడీ ఫ్లాష్, 4010 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆకర్షణీయమైన ఫీచర్స్ తో తమ బడ్జెట్ ఫ్రెండ్లీ, పవర్ ప్యాక్డ్ డివైస్ వినియోగదారులకు ఆకట్టుకుంటుందని కూల్ ప్యాడ్ సీఈవో సయ్యద్ తాజుద్దీన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీ , బెంగళూరు, చెన్నైలలో ఆఫ్ లైన్ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం తర్వాత మరో రెండు మూడు నెలల్లోమరో 13 నగరాల్లో లాంచ్ చేయనున్నట్టుచెప్పారు. -
69 ఏళ్ళ తర్వాత బస్సొచ్చింది!
ఉత్తరాఖండ్ః స్వతంత్రం వచ్చి ఆరవై ఏళ్ళు దాటిపోయినా ఇప్పటివరకూ ఆ గ్రామానికి రోడ్డు మార్గమే లేదు. ఊళ్ళోకి చేరాలంటే కొండలు గుట్లలు ఎక్కి వెళ్ళాల్సిందే. అక్కడ పుట్టి పెరిగి ముసలివారు కూడ అయిపోయిన వారు ఉన్నారేకానీ.. వారు ఒక్కసారైనా బస్సు ఎక్కేందుకే నోచుకోలేదట. అయితే వారి సుదీర్ఘ నిరీక్షణకు ఇప్పుడు తెరపడింది. 69 ఏళ్ళ తర్వాత ఆ గ్రామానికి బస్సొచ్చింది. ఉత్తరాఖండ్ మారుమూల గ్రామమైన సిల్పదా ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. ఏళ్ళ తరబడి చూసిన ఎదురు చూపులు ఫలించి గ్రామంలోకి 69 ఏళ్ళ తర్వాత బస్సు రావడంతో ఆనందంలో మునిగితేలుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంతో అక్కడి వారి కలలు నెరవేరాయి. పథకంలో భాగంగా గ్రామానికి రోడ్డు మార్గం వేయడంతో బస్సులు కూడ వచ్చే అవకాశం ఏర్పడింది. జిల్లా కేంద్రమైన చమోలీ, సిల్పదా గ్రామాలు దగ్గర్లోనే ఉన్నా... సిల్పదాకు ఇప్పటివరకూ రోడ్డు మార్గం లేకపోవడంతో బస్సు వచ్చే అవకాశమే లేకుండా పోయింది. దాంతో 69 ఏళ్ళ పాటు అక్కడి ప్రజలు ఎదురు చూపులతోనే కాలం వెళ్ళదీయాల్పి వచ్చింది. ఎన్నోసార్లు గ్రామప్రజలు పలు ప్రభుత్వాలకు అర్జీలు పెట్టినా ఫలితం లేకపోయింది. తమ గ్రామానికి రోడ్డుమార్గం, బస్సు సౌకర్యం కల్పించాలంటూ అనేకసార్లు ఆందోళనలు కూడ నిర్వహించిన దాఖలాలు లేకపోలేదు. ఇటీవలే సిల్పదా గ్రామంలో కేంద్ర ప్రభుత్వం రోడ్డు నిర్మాణం చేపట్టి అక్కడ సమకూరిన నిధులతో విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో తొలిసారి గ్రామంలోకి బస్సు వస్తుండటంతో స్థానికంగా పండుగ వాతావరణం కనిపించింది. పట్టలేని ఆనందంలో ఉన్నప్రజలు సంప్రదాయ నృత్యాలు, ఆటపాటలతో ఆనందంలో తేలియాడుతున్నారు. -
నేపాల్ చేరుకున్న సుష్మాస్వరాజ్
న్యూఢిల్లీ : సార్క్ సమావేశాల కోసం భారత విదేశ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ బుధవారం నేపాల్ చేరుకున్నారు. రేపటి నుంచి నేపాల్ లో జరగనున్న విదేశాంగ మంత్రుల స్థాయి సార్క్ సమావేశంలో ఆమె పాల్గొననున్నారు. సుష్మా నేపాల్ లోని పొఖారా చేరుకున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ ఓ ట్వీట్ లో తెలిపారు. మరోవైపు సార్క్ సమావేశాల సందర్భంలో పాకిస్తాన్ విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ తో సుష్మాస్వరాజ్ సమావేశం అయ్యే అవకాశం ఉందని పాకిస్తానీ మీడియా ఓ ప్రకటనలో తెలిపింది. పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి కారణంగా వాయిదాపడిన ఇండియా, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలపై సుష్మా, అజీజ్ లు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
అయోధ్యలో అలజడి..
-
చెన్నైవరద మృతులకు జపాన్ ప్రధాని సంతాపం
న్యూఢిల్లీ: చెన్నై వరదల్లో మరణించిన వారికి జపాన్ ప్రధానమంత్రి షింజొ అబే ప్రగాఢ సంతాపం తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన చెన్నై మృతులకు సంతాపాన్ని ప్రకటించారు. మూడవ సారి భారత పర్యటనకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, షింజొ పర్యటనను ఆహ్వానిస్తూ ట్వీట్ చేశారు. షింజొ భారతదేశ సందర్శన ఇరుదేశాల సంబంధాలకు కొత్త బలాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుందన్నారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధానికి విమానాశ్రయంలో కేంద్రమంత్రి జయంత్ సిన్హా తదితరులు ఘన స్వాగతం తెలిపారు. షింజొ రేపు ప్రధాని మోదీతో కలిసి వారణాసిలో పర్యటించనున్నారు. అనంతరం ఇండో-జపాన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. -
లండన్‌లో మోదీకి ఘన స్వాగతం
-
లండన్‌లో మోదీకి ఘన స్వాగతం
మూడు రోజుల యూకే పర్యటనలో భాగంగా బయలుదేరిన భారత ప్రధాని నరేంద్రమోదీ లండన్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో లండన్ చేరుకున్న మోదీని ఏయిర్ పోర్టులో అక్కడి అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో వాణిజ్య, ఆర్థిక, రక్షణ, విద్యుత్ రంగాల అభివృద్ధితోటు ఉగ్రవాదం, వాతావరణంలో మార్పుపైనా ఇంగ్లాండ్ ప్రధాని డెవిడ్ కెమెరూన్తో చర్చించనున్నారు. దశాబ్దం తర్వాత యూకేలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని అయిన మోదీ.. ఆర్థిక సహకారంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ పర్యటనలో మోదీ.. బ్రిటన్ ప్రధాని కెమెరూన్తో చర్చలతో పాటు.. బ్రిటన్ పార్లమెంటులో, ప్రవాస భారతీయులు వెంబ్లీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలోనూ ప్రసంగించనున్నారు. -
ఎట్టకేలకు ఆమర్ షేకర్ విడుదలయ్యాడు...
అతడి పేరు... షేకర్ ఆమర్... అమెరికా ఖాకీల కర్కశత్వానికి బలై.. ఖైదీల పాలిట నరకంగా పేరున్న గ్వాంటనామో బే జైల్లో పదమూడేళ్ళుగా మగ్గిపోతున్న చివరి బ్రిటిష్ పౌరుడు. ఎట్టకేలకు విడుదలై.. లండన్ చేరుకున్నాడు. అతడు చేసిన నేరమేమిటో కూడ చెప్పకుండా 2001 లో అతడ్నిబంధించారు. అయితే ప్రస్తుతం అతడి విడుదల తర్వాత ఏమిటి అన్నవిషయంపై ఎటువంటి ప్రత్యేక ప్రణాళికలు లేవని 'డౌనింగ్ స్ట్రీట్' అంటోంది. సౌదీ జాతీయులైన ఆమర్ కుటుంబం లండన్ లో నివసిస్తోంది. అతడి భార్య బ్రిటిష్ కు చెందినది కావడంతో ఆమర్ లండన్ లో నివసించేందుకు ఎటువంటి అభ్యంతరాలు లేవని యూకె ప్రధాని డేవిడ్ కామెరాన్ అన్నారు. ఆమర్ విడుదలను ఆయన స్వాగతించారు. ఆమర్ కు నలుగురు పిల్లలు. లండన్ బిగ్గిన్ హిల్స్ విమానాశ్రయానికి చేరిన ఆమర్ కు ప్రస్తుతం 48 ఏళ్ళ వయసు. అతని ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అతడికోసం అంబులెన్స్ ను విమానాశ్రయానికి పంపించారు. అతడ్ని కలిసేందుకు వచ్చిన ఆమర్ మామ.. సయీద్ సిద్ధిక్... ఆమర్ విడుదల అద్భుతమన్నారు. నిజంగా మిరాకిల్ అని అభిప్రాయ పడ్డారు. -
కశ్మీర్ లో కొనసాగుతున్న మోదీ పర్యటన
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. ఒకరోజు పర్యటన నిమిత్తం ఆయన శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో జమ్మూ కశ్మీర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, పలువురు సీనియర్ మంత్రులు తదితరులు ప్రధానికి ఘనస్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గిరిధర్ లాల్ దోగ్రా 100వ జయంతి సందర్భంగా ప్రధాని ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిధర్ లాల్ దోగ్రా సేవలను మోదీ గుర్తు చేశారు. జమ్మూ కశ్మీర్లో నేతలకు దోగ్రా ఆదర్శంగా నిలిచారని, ఆయన భౌతికంగా లేకున్నా, డోగ్రా మన స్మృతుల్లోనే ఉన్నారని అన్నారు. కాగా ప్రధానితో పాటూ, గిరిధర్ దోగ్రా అల్లుడు, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోదీ తన పర్యటనలో జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి రూ. 70 వేల కోట్ల విలువ గల ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉంది.ఈ నిధులతో జమ్మూకశ్మీర్‌లో పునరావాస, అభివృద్ధి కార్యక్రమాలు , గతేడాది వరద బాధితుల సహాయానికి ఖర్చు చేయనున్నారని సమాచారం. అలాగే జమ్మూకు మోదీ ఎయిమ్స్ ప్రకటిస్తారని ఆశిస్తున్నారు. జమ్మూ వర్సిటీ సందర్శించి, జనరల్ జోర్వార్ సింగ్ ఆడిటోరియంలో ప్రసంగించనున్నారు. కాగా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తల నేపథ్యంలో మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పర్యటన అనంతరం ఈ సాయంత్రం ఆయన రాజధానికి తిరిగి పయనమవుతారు. -
నేడు బీజేపీ కీలక సమావేశాలు
-
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి
-
నేడు రాష్ట్రానికి రాష్ట్రపతి రాక