లండన్లో మోదీకి ఘన స్వాగతం | PM Narendra Modi arrives in London for three–day bilateral visit | Sakshi
Sakshi News home page

లండన్లో మోదీకి ఘన స్వాగతం

Nov 12 2015 3:57 PM | Updated on Aug 15 2018 2:20 PM

లండన్లో మోదీకి ఘన స్వాగతం - Sakshi

లండన్లో మోదీకి ఘన స్వాగతం

మూడు రోజుల యూకే పర్యటనలో భాగంగా ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లిన భారత ప్రధాని నరేంద్రమోదీ లండన్ చేరుకున్నారు.

మూడు రోజుల యూకే పర్యటనలో భాగంగా బయలుదేరిన భారత ప్రధాని నరేంద్రమోదీ లండన్ చేరుకున్నారు.  ప్రత్యేక విమానంలో లండన్ చేరుకున్న మోదీని ఏయిర్ పోర్టులో అక్కడి అధికారులు ఘన స్వాగతం పలికారు.   


 ఈ పర్యటనలో వాణిజ్య, ఆర్థిక, రక్షణ, విద్యుత్ రంగాల అభివృద్ధితోటు ఉగ్రవాదం, వాతావరణంలో మార్పుపైనా ఇంగ్లాండ్ ప్రధాని డెవిడ్ కెమెరూన్తో చర్చించనున్నారు.  దశాబ్దం తర్వాత యూకేలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని అయిన మోదీ.. ఆర్థిక సహకారంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ పర్యటనలో మోదీ.. బ్రిటన్ ప్రధాని కెమెరూన్తో చర్చలతో పాటు.. బ్రిటన్ పార్లమెంటులో, ప్రవాస భారతీయులు వెంబ్లీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలోనూ ప్రసంగించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement