మణిపుర్‌ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం | Prime Minister Modi Arrives In Manipur | Sakshi
Sakshi News home page

మణిపుర్‌ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం

Sep 13 2025 12:23 PM | Updated on Sep 13 2025 1:41 PM

Prime Minister Modi Arrives In Manipur

ఇంఫాల్‌: ఈశాన్య ప్రాంతంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా, ప్రధాని మోదీ శనివారం మణిపుర్‌కు వచ్చారు. ఇంఫాల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధానికి గవర్నర్‌ అజయ్‌ కుమార్‌ భల్లా, రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ పునీత్‌ కుమార్‌ గోయెల్‌ స్వాగతం పలికారు. 2023లో ఈ ఈశాన్య రాష్ట్రంలో హింసాత్మక ఘర్షణల తర్వాత మోదీ ఇక్కడ పర్యటించడం ఇదే తొలిసారి.
 

2023 మే నెలలో జాతి ఘర్షణలు చెలరేగిన తర్వాత తొలిసారి మోదీ తొలిసారిగా మణిపుర్‌కు వచ్చారు. ఈ పర్యటనలో ఆయన చురాచంద్‌పూర్, ఇంఫాల్‌లను సందర్శించనున్నారు. అలాగే రూ. 8,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ప్రధాని మోదీ సందర్శన రాష్ట్రంలో శాంతి, అభివృద్ధిని పునరుద్ధరించడానికి దోహదపడుతుందని మణిపూర్ ముఖ్య కార్యదర్శి పునీత్ కుమార్ గోయల్ అన్నారు.


 

 మణిపూర్‌లోని చురాచంద్‌పూర్‌కు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అపూర్వ స్వాగతం లభించింది. ఆయనను స్వాగతించడానికి దారి పొడవునా స్థానికులు నిలుచున్నారు. మోదీ వారికి అభివాదాలు తెలిపారు. ప్రధాని మోదీ రూ. 7,300 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు పునాది వేయనున్నారు. వాటిలో ముఖ్యమైనవిమణిపూర్ అర్బన్ రోడ్స్, డ్రైనేజీ, ఆస్తి నిర్వహణ మెరుగుదల ప్రాజెక్ట్. ఇది పట్టణ రవాణా, ప్రజా సేవలను అప్‌గ్రేడ్ చేయడానికి రూ.3,600 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. చురచంద్‌పూర్‌లో రూ.7,300 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement