చిన్నారిని రేప్‌ చేస్తే ఉరే సరి ! | Supreme court upholds death penalty awarded to man for raping minor | Sakshi
Sakshi News home page

చిన్నారిని రేప్‌ చేస్తే ఉరే సరి !

May 4 2017 1:47 AM | Updated on Sep 2 2018 5:24 PM

చిన్నారిని రేప్‌ చేస్తే ఉరే సరి ! - Sakshi

చిన్నారిని రేప్‌ చేస్తే ఉరే సరి !

నాలుగేళ్ల చిన్నారిని రేప్‌చేసి, కిరాతకంగా రాళ్లతో మోది చంపిన కేసులో దోషికి ఉరిశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది.

న్యూఢిల్లీ: నాలుగేళ్ల చిన్నారిని రేప్‌చేసి, కిరాతకంగా రాళ్లతో మోది చంపిన కేసులో సుప్రీంకోర్టు దోషి దాఖలు చేసుకున్న రివ్యూ పిటిషన్‌ను కొట్టేస్తూ, అతనికి విధించిన ఉరిశిక్షను సమర్థించింది. నేరం జరిగిన తీరును దృష్టిలో పెట్టుకుని అతడి శిక్షను తగ్గించలేమని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్, జస్టిస్‌ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది.

దోషి వసంత సంపత్‌ దుపారే ప్రస్తుతం నాగ్‌పూర్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 2008 నాటి రేప్, హత్య కేసులో అతడికి బాంబే హైకోర్టు, ట్రయల్‌ కోర్టులు ఇదివరకే ఉరిశిక్ష విధించాయి. నాగ్‌పూర్‌కు చెందిన 55 ఏళ్ల దుపారే పక్కింట్లో ఉంటున్న చిన్నారికి చాక్లెట్ల ఆశచూపి అత్యాచారం చేశాడు. ఆ తరువాత రెండు పెద్ద బండరాళ్లతో కొట్టి చంపేశాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement