న్యాయాధికారుల విభజన : రేపటికి వాయిదా వేసిన సుప్రీం కోర్టు

Supreme Court Postpone Inquiry Of Division of High Court judges In Telugu States - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల న్యాయాధికారుల విభజనపై సుప్రీం కోర్టులో చేపట్టిన విచారణ రేపటికి వాయిదా పడింది. విభజనపై మంగళవారం సుప్రీం కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. సీనియారిటీ ప్రకారం విభజన చేస్తే తెలంగాణ న్యాయాధికారులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ న్యాయాధికారుల సంఘం తరపున సల్మాన్‌ ఖుర్షి, అహ్మద్‌లు వాదనలు వినిపించారు. గంటకు పైగా వాదనలు విన్న ధర్మసనం తదుపరి విచారణను రేపటికి (బుధవారం)వాయిదా వేసింది. న్యాయాధికారుల విభజనపై హైకోర్టు ఇచ్చిన గైడ్‌ లైన్స్‌పై తెలంగాణ న్యాయాధికారుల సంఘం సుప్రీం కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top