సమష్టి నిర్ణయంతో సన్‌టీవీకి అనుమతులు | Sun TV hopeful of obtaining security clearance: CFO | Sakshi
Sakshi News home page

సమష్టి నిర్ణయంతో సన్‌టీవీకి అనుమతులు

Jun 30 2015 1:02 AM | Updated on Sep 3 2017 4:35 AM

సమష్టి నిర్ణయంతో సన్‌టీవీకి అనుమతులు

సమష్టి నిర్ణయంతో సన్‌టీవీకి అనుమతులు

కళానిధి మారన్ ఆధ్వర్యంలో నడుస్తున్న 33 టీవీ చానళ్ల సన్ టీవీ నెట్‌వర్క్ ప్రసారాలకు అనుమతులు మంజూరు చేయాలంటే...

న్యూఢిల్లీ: కళానిధి మారన్ ఆధ్వర్యంలో నడుస్తున్న 33 టీవీ చానళ్ల సన్ టీవీ నెట్‌వర్క్ ప్రసారాలకు అనుమతులు మంజూరు చేయాలంటే కేంద్రంలోని సంబంధిత శాఖలు సమష్టిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సోమవారం కేంద్రం తెలిపింది.
ఈ అంశంపై కీలకమైన కేంద్ర హోం , కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

కళానిధి, అతడి సోదరుడు కేంద్ర మాజీమంత్రి దయానిధి మారన్‌లపై ఉన్న పెండింగ్ కేసులను సన్‌టీవీ చానళ్లను నిర్వహిస్తున్న ఆయా కంపెనీలు ప్రభావితం చేసే అవకాశముందని హోం శాఖ భావిస్తోంది. దీంతో సన్‌టీవీ నెట్‌వర్క్‌కు భద్రతాపరమైన అనుమతులను నిరాకరిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement