స్వీయ నిర్బంధంలో ఉన్న ఎమ్మెల్సీకి పాము కాటు

Shiv Sena MLC Who Recovered From Corona Getting Bitten By Snake - Sakshi

ముంబై :  కరోనా వైరస్‌ నుంచి కోలుకొని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వచ్చిన శివసేన ఎమ్మెల్సీ .. మరుసటి రోజే పాము కాటుకు గురయ్యారు. దీంతో ఆయన మళ్లీ ఆస్పత్రిలో చేరాడు. థానేకి చెందిన శివసేన ఎమ్మెల్సీకి మే 9న కరోనావైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆయనను ములుంద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజుల చికిత్స అనంతరం మే 15న ఆయనను డిశ్చార్జి చేశారు. (చదవండి : ఎంత క‌ష్టం: కావ‌డిలో క‌న్నబిడ్డ‌ల‌ను మోస్తూ)

కొద్ది రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలన్న వైద్యుల సలహా మేరకు సంజయ్‌‌ గాంధీ నేషనల్‌ పార్క్‌ సమీపంలో ఉన్న తన బంగ్లాలోకి వెళ్లాడు. పార్టీ కార్యకర్తలకు, అనుచరులకు దూరంగా ఉండేందుకు ఆయన ఆ బంగ్లాలో ఉండాలని నిర్ణయించుకున్నారు. కాగా, శనివారం సాయంత్రం ఇంటిముందు కూర్చున్న ఆయనను ఓ విష పూరిత పాము కాటేసింది. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రసుత్తం ఎమ్మెల్సీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top