'నేనేం కట్టుబానిసను కాదు.. కాంగ్రెస్‌కు గుడ్‌బై' | Shankarsinh Vaghela quits Congress | Sakshi
Sakshi News home page

'నేనేం కట్టుబానిసను కాదు.. కాంగ్రెస్‌కు గుడ్‌బై'

Jul 21 2017 4:23 PM | Updated on Mar 18 2019 9:02 PM

'నేనేం కట్టుబానిసను కాదు.. కాంగ్రెస్‌కు గుడ్‌బై' - Sakshi

'నేనేం కట్టుబానిసను కాదు.. కాంగ్రెస్‌కు గుడ్‌బై'

ఇరవైనాలుగు గంటల్లో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ పార్టీ నేత శంకర్‌సిన్హా వాఘెలా అనుకున్నంత పనిచేశారు. తాను కాంగ్రెస్‌ పార్టీని ఇక పూర్తిగా వదిలేస్తున్నానని ప్రకటించారు.

న్యూఢిల్లీ: ఇరవైనాలుగు గంటల్లో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ పార్టీ నేత శంకర్‌సిన్హా వాఘెలా అనుకున్నంత పనిచేశారు. తాను కాంగ్రెస్‌ పార్టీని ఇక పూర్తిగా వదిలేస్తున్నానని ప్రకటించారు. కాంగ్రెస్‌ సభ్యత్వానికి, ఇతర అన్ని హోదాల నుంచి తప్పుకుంటున్నానని, రాజ్యసభ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. శుక్రవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా భారీ కార్యక్రమం ఏర్పాటుచేసి ఆయన కార్యకర్తల మధ్య ఈ విషయం ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆయనను 24గంటల కిందనే బహిష్కరించింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వేదికపై ప్రకటించారు.

'నేను ప్రతిపక్ష నాయకుడిగా రాజీనామా చేశాను. రాజ్యసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. నేనేం కాంగ్రెస్‌ పార్టీకి కట్టుబానిసను కాదు. ఇప్పుడు నేనొక స్వేచ్ఛా జీవిని. నేను నా పుట్టిన రోజు వేడుకల నాడు ఏదో చెబుతానని కాంగ్రెస్‌ పార్టీ ఊహించుకొని నన్ను పార్టీ నుంచి తొలగించింది. కానీ నేను ఏం చెబుతానని వారు ఊహించారో అది మాత్రం నేను చెప్పట్లేదు. అయితే, బీజేపీపై పూర్తి స్థాయిలో నన్ను పోరాడనీయకుండా చేస్తుండటం వల్లే పార్టీ నుంచి తప్పుకుంటున్నాను. అలాగని, నేను పూర్తిగా రాజకీయాల్లో శాశ్వతంగా నుంచి తప్పుకుంటున్నానని కాదు(ఇలా చెప్పడం ద్వారా త్వరలో ఆయన మరోసారి తన పార్టీ బీజేపీలోకే వెళతారనే ఊహలకు మరింత ప్రాణం పోశారు)' అని వాఘెలా చెప్పారు. 20 ఏళ్ల కిందట బీజేపీతో కలిసి పనిచేసిన వాఘెలా అనంతరం ఆ పార్టీకి ఎదురు తిరిగి తన రాష్ట్రియ జనతా పార్టీ(ఆర్జేపీ)ని కాంగ్రెస్‌లో కలిపి ఆ పార్టీతో జత కట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement