అత్యాచార బాధితురాలికి ఆస్పత్రిలో అవమానం | rape victim had to wait semi nude in hospital | Sakshi
Sakshi News home page

అత్యాచార బాధితురాలికి ఆస్పత్రిలో అవమానం

Jul 23 2014 3:12 PM | Updated on Jul 28 2018 8:43 PM

మానసికంగా వికలాంగురాలైన ఓ యువతిపై ఆమె పొరుగింటి వ్యక్తి అత్యాచారం చేయగా, ఆమెను వైద్య పరీక్షల పేరిట కొన్ని గంటల పాటు ఆస్పత్రిలో అర్ధనగ్నంగా వేచి ఉంచారు.

సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన ఇది. శారీరకంగా, మానసికంగా వికలాంగురాలైన ఓ యువతిపై ఆమె పొరుగింటి వ్యక్తి అత్యాచారం చేయగా, ఆమెను వైద్య పరీక్షల పేరిట కొన్ని గంటల పాటు ఆస్పత్రిలో అర్ధనగ్నంగా వేచి ఉంచారు. ఈ ఘోర సంఘటన కర్ణాటకలో జరిగింది. మైసూరు జిల్లాలోని వరుణ ప్రాంతంలో బాధితురాలిపై ఆమె పొరుగింట్లో ఉండే వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ ప్రాంతం స్వయానా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.

బాధితురాలు తొలుత వైద్య పరీక్షలు చేయించుకోడానికి భయపడి నిరాకరించింది. తర్వాత ఆమెను అర్ధనగ్నంగా కొన్ని గంటల పాటు ఆస్పత్రిలో బెడ్ మీద ఉంచేశారు. అయితే ఆమెను అంతసేపు ఎందుకు ఉంచాల్సి వచ్చిందన్న విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఈ సంఘటనపై స్పందించి, వైద్యులను పిలిపించి విచారించింది. అత్యాచార బాధితులను పరీక్షించేందుకు తమ ఆస్పత్రిలో తగిన సదుపాయాలు లేవని, అందుకే ఆమెను అంతసేపు ఉంచాల్సి వచ్చిందని ఆయన అన్నట్లు సమాచారం!!

(ఇంగ్లీషులో ఇక్కడ చదవండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement