నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయి.
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయి. రాజస్థాన్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఘోరంగా చతికిలపడింది. ఓటమికి నైతికబాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు చంద్రభాన్ తన పదవికి రాజీనామా చేశారు.
మండవ నియోజకవర్గం నుంచి పోటీచేసిన చంద్రభాను ఓటమి దిశగా పయనిస్తున్నారు. ఏమాత్రం పోటీనివ్వలేకపోగా నాలుగో స్థానానికి దిగజారారు. ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా లేఖను ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. 200 స్థానాలున్న రాజస్థాన్ శాసనసభలో కాంగ్రెస్ కేవలం 12 స్థానాల్లో గెలవగా మరో తొమ్మిది చోట్ల ఆధిక్యంలో ఉంది. బీజేపీ తిరుగులేని మెజార్టీతో అధికారం దిశగా దూసుకెళ్తోంది. ఢిల్లీ, మధ్యప్రదేశ్లోనూ కాంగ్రెస్ ఘోరంగా చతికిలపడింది.