‘ఆ పార్టీలో గడ్కరీ ఒక్కడే సరైనోడు’ | Rahul Says Nitin Gadkari Only BJP Leader With Guts | Sakshi
Sakshi News home page

‘ఆ పార్టీలో గడ్కరీ ఒక్కడే సరైనోడు’

Feb 4 2019 6:18 PM | Updated on Feb 4 2019 6:18 PM

Rahul Says Nitin Gadkari Only BJP Leader With Guts - Sakshi

గడ్కరీకే ఆ సత్తా ఉందన్న రాహుల్‌

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఒక్కరే కాస్త ధైర్యమున్న నేతని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ అన్నారు. రఫేల్‌ కుంభకోణంతో పాటు, రైతుల దుస్ధితి, వ్యవస్ధల నిర్వీర్యంపై తమ ప్రశ్నలకు ఆయన బదులివ్వాలని రాహుల్‌ కోరారు. ‘గడ్కరీజీ..బీజేపీలో కాస్త ధైర్యం ఉన్న నాయకులు మీరే అయినందుకు ధన్యవాదాలు..మోదీ సర్కార్‌లో ముందుకొచ్చిన రఫేల్‌ స్కామ్‌, రైతుల దుస్ధితి, వ్యవస్థలను నిర్వీర్యం చేయడంపైనా మీరు వ్యాఖ్యలు చేయా‘లని సోమవారం రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

కేంద్ర మంత్రి గడ్కరీ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్‌ ఈ ట్వీట్‌ చేయడం గమనార్హం. కాగా, శనివారం నాగపూర్‌లో జరిగిన ఏబీవీపీ విద్యార్ధుల సదస్సులో గడ్కరీ మాట్లాడుతూ ముందు మీరు మీ ఇంటిని చక్కదిద్దుకోవాలని, ఇంటిని సవ్యంగా నిర్వహించుకోలేని వారు దేశానికి ఏమీ చేయలేరని హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement