ఆటోలో గర్భిణి మృతి

Pregnant Woman Deceased In Auto In Thane - Sakshi

మహా నిర్లక్ష్యం

ముంబై : నిండు గర్భిణికి చికిత్స అందించేందుకు పలు ఆస్పత్రులు నిరాకరించడంతో ఆటోలోనే బాధితురాలు మరణించిన ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించిన మూడు ఆస్పత్రులపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మే 25 ఆర్ధరాత్రి జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. గర్భిణి అస్మా మెహంది (26)కి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆస్పత్రికి వెళ్లగా ఆమెను చేర్చుకునేందుకు నిర్వాహకులు నిరాకరించారు.

వరుసగా మూడు ఆస్పత్రుల్లోనూ వారికి నిరాశే ఎదురైంది. బిలాల్‌ హాస్పిటల్‌, ప్రైమ్‌ క్రిటికేర్‌, యూనివర్సల్‌ హాస్పిటల్‌లకు వెళ్లగా ఆమెను చేర్చుకునేందుకు నిరాకరించారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగే క్రమంలో నొప్పులు అధికమై గర్భిణి ఆటోలోనే మరణించారు. కుటుంబ సభ్యులు నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి మూడు ఆస్పత్రులపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆస్పత్రుల్లో చేర్చుకునేందుకు నిరాకరించడంతో మహిళ రోడ్డుపైనే మరణించడం దిగ్భ్రాంతికరమని మహారాష్ట్ర బీజేపీ నేత రామ్‌ కదం ఆందోళన వ్యక్తం చేశారు. ముంబైలో రోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క రోడ్డుపైనే మరణిస్తున్నారని అన్నారు.

చదవండి : ఒక్కరోజులో 8,000 మంది డిశ్చార్జ్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top