కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా ప్రదీప్ కుమార్ | pradeepkumar appointed as central cabinet secretary | Sakshi
Sakshi News home page

కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా ప్రదీప్ కుమార్

May 30 2015 5:41 AM | Updated on Aug 20 2018 9:26 PM

కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా ప్రదీప్ కుమార్ - Sakshi

కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా ప్రదీప్ కుమార్

కేంద్ర కేబినెట్ కొత్త కార్యదర్శిగా 1977 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ప్రదీప్ కుమార్ సిన్హా నియుక్తులయ్యారు.

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ కొత్త కార్యదర్శిగా 1977 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ప్రదీప్ కుమార్ సిన్హా నియుక్తులయ్యారు. శుక్రవారం ఆయన నియామకానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదముద్ర వేశారు. 59 ఏళ్ల సిన్హా ఈ పదవిలో రెండేళ్లపాటు ఉంటారు. నాలుగేళ్లుగా ఈ పదవిలో కొనసాగుతున్న అజిత్ సేథ్ స్థానంలో సిన్హా నియుక్తులయ్యారు. ప్రస్తుతం ఇంధనశాఖ కార్యదర్శిగా ఉన్న సిన్హా ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందినవారు. జూన్ 13న ఆయన అధికారిక బాధ్యతలు చేపట్టనున్నారు. అంతవరకు కేబినెట్ సెక్రటేరియట్‌లో ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తారు. 2013 నుంచి ఇంధనశాఖ కార్యదర్శిగా ఉన్న సిన్హా అంతకు ముందు నౌకాయాన శాఖ కార్యదర్శిగా పనిచేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement