ప్రధాని ట్విట్టర్‌ ఫాలోయర్లు 6 కోట్లు | PM Narendra Modi Twitter Followers Rise From 5 To 6 Crores | Sakshi
Sakshi News home page

ప్రధాని ట్విట్టర్‌ ఫాలోయర్లు 6 కోట్లు

Jul 20 2020 3:58 AM | Updated on Jul 20 2020 9:23 AM

PM Narendra Modi Twitter Followers Rise From 5 To 6 Crores  - Sakshi

న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజా బాహుళ్యానికి ప్రధాని మోదీ మరింత చేరువవుతున్నారు. తాజాగా, మైక్రో బ్లాగింగ్‌ వేదిక ట్విట్టర్‌లో ప్రధాని మోదీ ఫాలోయర్ల సంఖ్య 6 కోట్లకు చేరుకుంది. ప్రధాని తరచూ ట్విట్టర్‌లో ప్రజలకు అవసరమైన ముఖ్యమైన సమాచారాన్ని షేర్‌ చేస్తున్నారు. తన ట్విట్టర్‌ హ్యాండిల్‌ ‘ఎట్‌ది రేటాఫ్‌ నరేంద్ర మోదీ’ద్వారా లైవ్‌లో ప్రసంగిస్తున్నారు. 2009 జనవరిలో ప్రధాని మోదీ ట్విట్టర్‌లో చేరగా 2019 సెప్టెంబర్‌ నాటికి ఫాలోయర్ల సంఖ్య 5 కోట్లకు చేరుకుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ప్రధానికి 4.5 కోట్ల ఫాలోయర్లున్నారు. ప్రధాని కార్యాలయం ట్విట్టర్‌ హ్యాండిల్‌కు కూడా 3.7 కోట్ల ఫాలోయర్లున్నారు. కాగా, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా 12 కోట్ల మంది ఫాలోయర్లతో అగ్రస్థానంలో ఉండగా, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌కు 8.3 కోట్ల మంది ఫాలోయర్లున్నారు. ఆ తర్వాత స్థానం ప్రధాని మోదీదే కావడం గమనార్హం. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి ట్విట్టర్‌లో 1.5 కోట్ల మంది ఫాలోయర్లున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement