ఎంపీలు.. మీ ప్రోగ్రెస్‌ చెప్పండి?! | Sakshi
Sakshi News home page

ఎంపీలు.. మీ ప్రోగ్రెస్‌ చెప్పండి?!

Published Fri, Jan 5 2018 1:08 PM

PM Modi asks report card from all BJP MPs - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేం‍ద్ర మోదీ అప్పుడే 2019 లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఈ నాలుగేళ్ల కాలంలో నియోజకవర్గాల్లో సాధించిన ప్రగతిని వివరించాలంటూ ప్రధాని మోదీ పార్టీలకు సూచించారు. ప్రజలకు అందించిన మౌలిక సదుపాయాల కల్పన, కీలకమైన విజయాలు, సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి చేసిన కృషిపై ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ఇవ్వాలని ఆయన ఎంపీలకు తెలిపారు. 

కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులపై ప్రజలనుంచి అభిప్రాయాలను సేకరించాలని సహచర మంత్రులకు మోదీ సూచించారు. ఇదిలావుండగా.. ఇప్పటికే 250 మంది బీజేపీ ఎంపీల నమో యాప్‌ను తమ స్మార్ట్‌ ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసుకున్నట్లు తెలిసింది. 

Advertisement
 
Advertisement