బుధవారం నాటి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి.
న్యూఢిల్లీ: బుధవారం నాటి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం తొమ్మిది సవరణలతో భూసేకరణ పునరావాస బిల్లును లోక్ సభలో మూజువాణి ఓటుతో నెగ్గించుకుంది అధికార పక్షం. రాజ్యసభ ఆమోదం కోసం ఎదరు చూస్తోంది. కాగా దేశంలోని వ్యవసాయ రంగపరిస్థితి, 2015-16 ర్వైల్వే బడ్జెట్ పై బుధవారం చర్చ జరగనుంది.
భూసేకరణ పునరావాస బిల్లు ఆమోదానికి రాజ్యసభలో కూడా పెట్టనుంది. రాజ్యసభలో మెజార్టీ లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది బీజేపీ సర్కార్. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలను బుజ్జగించే పనిలో ఉంది. మరిన్ని సూచనలూ, సవరణలూ స్వీకరిస్తామంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి బీరేంద్రసింగ్ నిన్న లోక్ సభలో ప్రకటించారు. వీటితో పాటు ఇప్పటికే లోక్ సభలో ఆమోదించిన గనుల మరియు ఖనిజాల ఖనిజాలు (అభివృద్ధి, క్రమబద్ధీకరణ) సవరణ బిల్లు-2015, మోటార్ వాహనాల (సవరణ) బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. .