పారామిలటరీ సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్ బీ) జవాన్ అనుమానాస్పద స్తితిలో మృతి చెందాడు
	పారామిలటరీ సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్ బీ) జవాన్ అనుమానాస్పద స్తితిలో మృతి చెందాడు. రామ్బాన్ జిల్లా లోని అతని క్వార్టర్స్ లో  ఇన్ స్పెక్టర్ రమేశ్ చంద్ర జోషీ మృత దేహాన్ని గురువారం ఉదయం కనుగొన్నారు. అయితే మృతికి గల కారణాలు తెలియరాలేదు. అతను ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన వాడని.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసులు అధికారి తెలిపారు.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
