సినిమాహాళ్లకు మరో నెల విరామం 

One More Month Lockdown For Cinema Halls Due To Coronavirus In India - Sakshi

స్కూళ్లు, మెట్రో సర్వీసులు కూడా..

అన్‌లాక్‌–2 మార్గదర్శకాలను ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌–19 వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, జిమ్‌లు, మెట్రో రైలు సర్వీసుల పునఃప్రారంభాన్ని మరో నెలపాటు వాయిదా వేయాలని కేంద్రం నిర్ణయించింది. దశలవారీగా ఆంక్షలను సడలించేందుకు విధించిన అన్‌లాక్‌–1 గడువు మంగళవారంతో ముగియనుండగా ఈ మేరకు సోమవారం రాత్రి హోం శాఖ అన్‌లాక్‌–2 మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల నుంచి అందిన సమాచారం మేరకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసినట్లు తెలిపింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో జూలై 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కఠినంగా అమలవుతుంది. కోవిడ్‌–19 వ్యాప్తికి అడ్డుకట్ట వేసేలా ఈ జోన్ల పరిధిని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలే నిర్ణయించాల్సి ఉంటుందని, ఈ విషయంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. కంటైన్‌మెంట్‌ జోన్ల పరిధిలో అత్యవసర సేవలకే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. 

► స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు జూలై 31వ తేదీ వరకు మూసివేసి ఉంటాయి. 
► సినిమాహాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, సమావేశమందిరాలను కూడా తెరవరాదు. 
► సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, మత సంబంధ ఉత్సవాలు, భారీ సమావేశాలపై నిషేధం కొనసాగుతుంది. పరిస్థితులను బట్టి వీటిని తెరిచే విషయమై తేదీలను తర్వాత ప్రభుత్వం ప్రకటిస్తుంది. 
► దేశీయ, అంతర్జాతీయ(వందేభారత్‌ మిషన్‌)విమానాలు, ఇప్పటికే పరిమిత సంఖ్యలో నడుస్తున్న ప్యాసింజర్‌ రైలు సర్వీసులను పరిస్థితులను బట్టి పెంచనుంది.

నేడు మోదీ ప్రసంగం
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు జాతి నుద్దేశించి ప్రసంగించనున్నారు. గల్వాన్‌ లోయలో జూన్‌ 15వ తేదీన జరిగిన భారీ ఘర్షణల అనంతరం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగించనుండటం గమనార్హం. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

06-07-2020
Jul 06, 2020, 05:36 IST
న్యూఢిల్లీ: 106 సంవత్సరాల వృద్ధుడి అపూర్వమైన విజయగాథ ఇది. 1918లో నాలుగేళ్ల వయసులో స్పానిష్‌ ఫ్లూ బారినపడి కోలుకొని, మళ్లీ...
06-07-2020
Jul 06, 2020, 05:00 IST
సాక్షి, అమరావతి: కరోనా పాజిటివ్‌ వచ్చినప్పుడు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం తదితర లక్షణాలు బయటపడతాయి. అయితే చాలా...
06-07-2020
Jul 06, 2020, 04:55 IST
ఈ రోజుల్లో బీమా పాలసీ లేకుండా వైద్య చికిత్సల ఖర్చులను భరించడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. ఏటేటా...
06-07-2020
Jul 06, 2020, 04:20 IST
బెర్లిన్‌: కరోనా బాధితులకు యాంటీ మలేరియా డ్రగ్‌ హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పెద్దగా ఉపయోగం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. బాధితులకు...
06-07-2020
Jul 06, 2020, 04:17 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా బారినపడ్డ వారిలో 8,422 మంది రికవరీ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం బులెటిన్‌లో...
06-07-2020
Jul 06, 2020, 04:15 IST
గువాహటి: కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రమవుతున్న సమయంలోనే.. మత ప్రబోధకుడి అంత్యక్రియలకు వేలాదిగా జనం హాజరు కావడంతో అస్సాం ప్రభుత్వం...
06-07-2020
Jul 06, 2020, 04:09 IST
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. వైరస్‌ వ్యాప్తి నానాటికీ విపరీతంగా పెరిగిపోతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం...
06-07-2020
Jul 06, 2020, 04:03 IST
వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ వ్యాప్తికి, ప్రపంచవ్యాప్తంగా అది సృష్టించిన మారణహోమానికి చైనానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి...
06-07-2020
Jul 06, 2020, 03:51 IST
మొదటి లక్ష టెస్టులకు 59 రోజుల సమయం పడితే 10వ లక్ష టెస్టులు చేయడానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పట్టింది.  చివరి...
06-07-2020
Jul 06, 2020, 02:23 IST
కూకట్‌పల్లిలో  ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. హోం క్వారం టైన్‌లో ఉండి చికిత్స పొందుతా నన్న అతను.....
06-07-2020
Jul 06, 2020, 02:11 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 1,590 మంది కరోనా బారిన పడ్డారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 5,290 మందికి పరీక్షలు నిర్వహించగా,...
06-07-2020
Jul 06, 2020, 02:01 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా రోగులపై ప్రైవేటు ఆస్ప త్రులు అమానుషంగా వ్యవహరిస్తున్నాయి. అసలు మందే లేని కరోనాకు చికిత్స పేరుతో...
06-07-2020
Jul 06, 2020, 01:55 IST
గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ కార్పొరేట్‌  ఆసుపత్రిలో  నిమ్మ బస్వ నాగరాజు (42) కరోనాతో గత నెల 25న చేరి ఈ...
05-07-2020
Jul 05, 2020, 21:53 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 1590 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి....
05-07-2020
Jul 05, 2020, 20:14 IST
న్యూఢిల్లీ : కరోనాను అంతం చేయడంలో దేశీయ వ్యాక్సిన్లు ఏ విధంగా పోటీలో ఉన్నాయో తెలుపుతూ కేంద్ర శాస్త్ర, సాంకేతిక...
05-07-2020
Jul 05, 2020, 20:11 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఘోరంగా విఫలమయ్యారని  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట‌ రెడ్డి...
05-07-2020
Jul 05, 2020, 19:43 IST
కోవిడ్‌-19 నుంచి కోలుకున్న 106 ఏళ్ల వృద్ధుడు
05-07-2020
Jul 05, 2020, 19:37 IST
సాక్షి, న్యూఢిల్లీ : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషి, మాజీ ఎమ్మెల్యే మహేందర్ యాదవ్(70) కరోనా వైరస్‌ బారిన...
05-07-2020
Jul 05, 2020, 18:58 IST
జైపూర్‌: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వైరస్‌ బారిన పడినవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌ ప్రభుత్వం కీలక...
05-07-2020
Jul 05, 2020, 18:41 IST
తిరువనంతపురం: కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారిని దీటుగా నిలువరించేందుకు కోవిడ్‌-19 నిబంధనలను...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top