అదంతా అబద్ధం.. నిర్భయ తల్లి ఆశాదేవీ | Not interested On Politics Says Nirbhaya Mother Ashadevi | Sakshi
Sakshi News home page

అదంతా అబద్ధం.. నిర్భయ తల్లి ఆశాదేవీ

Jan 17 2020 6:47 PM | Updated on Jan 17 2020 9:01 PM

Not interested On Politics Says Nirbhaya Mother Ashadevi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నిర్భయ తల్లి ఆశాదేవి పోటీ చేస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సీఎం కేజ్రీవాల్‌పైనే ఆమె పోటీకి దిగుతారని.. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆఫర్ చేసిందనే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ వార్తలపై ఆశాదేవీ వెంటనే స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆమె కొట్టిపారేశారు. తనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని.. తాను ఏ పార్టీతో సంప్రదింపులు జరుపలేదని స్పష్టం చేశారు. అయితే, తన కూతురు నిర్భయ విషయంలో న్యాయం జరిగితే చాలని అన్నారు. తన కూతురుకు జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరకుండా పోరాటం కొనసాగిస్తానన్నారు. కాగా నిర్భయ దోషులకు ఉరిశిక్షను విధించాలని ఆశాదేవీ  పెద్ద ఎత్తున పోరాటం చేసిన విషయం తెలిసిందే. (నిర్భయ దోషులకు కొత్త డెత్‌వారెంట్లు జారీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement