బస్సులో మంటలు:9మంది దుర్మరణం | Nine killed as bus catches fire Amethi | Sakshi
Sakshi News home page

బస్సులో మంటలు:9మంది దుర్మరణం

Apr 21 2015 12:40 PM | Updated on Aug 18 2018 3:37 PM

బస్సులో మంటలు:9మంది దుర్మరణం - Sakshi

బస్సులో మంటలు:9మంది దుర్మరణం

ఉత్తరప్రదేశ్లో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అమేథీ జిల్లా పీపర్పూర్ సమీపంలో ఓ బస్సులో మంటలు

అమేథీ : ఉత్తరప్రదేశ్లో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  అమేథీ జిల్లా పీపర్పూర్ సమీపంలో ఓ బస్సులో మంటలు చెలరేగి తొమ్మిదిమంది మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు.  ఈ రోజు ఉదయం ప్రయాణికులతో బస్సు సుల్తాన్పూర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

రాంగాన్ గ్రామ సమీపంలోకి రాగానే షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సు ఇంజన్లో మంటలు చెలరేగినట్లు చెప్పారు.  ఆ సమయంలో బస్సులో 42మంది ప్రయాణికులు ఉన్నారు.  మంటలు చెలరేగటంతో కొంతమంది ప్రయాణికులు బస్సు అద్దాలు పగులగొట్టి ప్రాణాలతో బయటపడ్డారు.  గాయపడినవారిని చికిత్స నిమిత్తం సుల్తాన్పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.  మృతి చెందినవారి వివరాలను సేకరిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement