'బ్లాంక్ చెక్ ఇచ్చారు... థాంక్యూ' | Nepal ambassador dileep kumar upadhyay says thanks for Indian governments blank cheque | Sakshi
Sakshi News home page

'బ్లాంక్ చెక్ ఇచ్చారు... థాంక్యూ'

Apr 28 2015 6:55 PM | Updated on Sep 3 2017 1:02 AM

నేపాల్ భూకంపం నేపథ్యంలో సహాయ నిమిత్తం భారత ప్రభుత్వం బ్లాంక్ చెక్ ఇచ్చిందని, అందుకు భారత ప్రభుత్వానికి తమ దేశం రుణపడి ఉంటుందని నేపాల్ రాయబారి దిలిప్ కుమార్ ఉపాధ్యాయ్ అన్నారు.

కఠ్మాండు: నేపాల్ భూకంపం నేపథ్యంలో సహాయ నిమిత్తం భారత ప్రభుత్వం బ్లాంక్ చెక్ ఇచ్చిందని, అందుకు భారత ప్రభుత్వానికి తమ దేశం రుణపడి ఉంటుందని నేపాల్ రాయబారి దిలిప్ కుమార్ ఉపాధ్యాయ్ అన్నారు. సాక్షి మీడియాతో మంగళవారం ఆయన మాట్లాడారు. టెంట్లు, మెడికల్ కిట్లు వారికి చాలా అవసరమని, భూ ప్రకంపనలతో నేపాల్ ప్రజలు ఆందోళనలో ఉన్నారని చెప్పారు.

పరిస్థితి కుదుట పడేందుకు మరో 6రోజులు పడుతుందని అభిప్రాయపడ్డారు. అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ఎక్కువ సంఖ్యలో వైద్యసాయం ఇవ్వాలని భారత్ ని కోరినట్లు నేపాల్ రాయబారి దిలిప్ కుమార్ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement