ఎన్‌డీ తివారీ పరిస్థితి విషమం | ND tiwari health critical | Sakshi
Sakshi News home page

ఎన్‌డీ తివారీ పరిస్థితి విషమం

Jul 11 2018 2:15 AM | Updated on Jul 11 2018 2:15 AM

ND tiwari health critical - Sakshi

న్యూఢిల్లీ: రాజకీయ కురువృద్ధుడు నారాయణ్‌ దత్‌ తివార్‌(92) ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర రావత్‌ తెలిపారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన తివారీని కుటుంబసభ్యులు గత ఏడాది సెప్టెంబర్‌ 20న ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. కీలక అవయవాలు పనిచేయక పోవటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని రావత్‌ చెప్పారు.

మంగళవారం ఆస్పత్రికి చేరుకున్న రావత్‌.. తివారీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కిడ్నీలు పనిచేయడం లేదనీ, కడుపులో ఇన్‌ఫెక్షన్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తివారీ కొడుకు చెప్పారు. తివారీ మూడుసార్లు ఉత్తరప్రదేశ్‌కు, ఒకసారి ఉత్తరాఖండ్‌కు సీఎంగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement