మీ దృష్టిలో ఎవరు మంచి విమర్శకులు అని అడిగిన ప్రశ్నకు సల్మాన్ కొత్తగా స్పందించారు. ప్రతి సినిమా విషయంలోనూ తనకు తన తండ్రే పెద్ద విమర్శకుడని తెలిపాడు.
ముంబైః బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన సినిమాలపై విమర్శకుల గురించి అడిగిన ప్రశ్నకు భిన్నంగా స్పందించాడు. ప్రేక్షలకు ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందిస్తున్న సూపర్ స్టార్.. తాజా సినిమా సుల్తాన్ కూడ సునామీ సృష్టిస్తున్న తరుణంలో తన తండ్రే తనకు పెద్ద విమర్శకుడని చెప్పుకొచ్చారు.
మీ దృష్టిలో ఎవరు మంచి విమర్శకులు అని అడిగిన ప్రశ్నకు సల్మాన్ కొత్తగా స్పందించారు. ప్రతి సినిమా విషయంలోనూ తనకు తన తండ్రే పెద్ద విమర్శకుడని తెలిపాడు. ముందుగా ఆయన స్పందనే నాకు ముఖ్యమని, ప్రతి సినిమా చూసి వచ్చిన తర్వాత మా త్రండ్రి సలీం ఖాన్... తన అభిప్రాయాన్ని ఎంతో సున్నితంగా చెప్తుంటారని తెలిపాడు. ఆయనకు నచ్చితే ఆ సినిమా విషయం ఇక మర్చిపోయి హాయిగా నిద్రపోవచ్చని చెప్తుంటారని, నచ్చకపోయినప్పుడు కూడా ఆ విషయం మర్చపోయి మరో సినిమాకు ఇంకొంచెం ఎక్కువ కష్టపడమని సూచిస్తుంటారని సల్మాన్ వివరించాడు. అయితే మీకోసం ఆయన ఏదైనా స్క్రిప్ట్ రాస్తుంటారా అన్న ప్రశ్నకు మాత్రం... ఆయన ప్రత్యేకంగా స్క్రిప్ట్ రాయకపోయినా, అద్భుతమైన వ్యాసాలు రాస్తుంటారని, ప్రస్తుతం ట్వీట్లు కూడా చేస్తున్నారని అన్నాడు. నేను ఎన్నో ఏళ్ళుగా సినిమాలపై అత్యంత శ్రద్ధ కనబరుస్తున్నానని, ఒక చిత్రంలో చేసినట్లు మరోదాంట్లో చేయనని, ఒకసారి జరిగిన తప్పు మరోసారి జరగనివ్వనని ఈ సందర్భంలో తెలిపాడు.