పోజు తెచ్చిన పాట్లు.. | mp photo shoot with guns | Sakshi
Sakshi News home page

పోజు తెచ్చిన పాట్లు..

Feb 9 2014 12:55 AM | Updated on Oct 8 2018 6:08 PM

పోజు తెచ్చిన పాట్లు.. - Sakshi

పోజు తెచ్చిన పాట్లు..

జేమ్స్‌బాండ్‌లా తుపాకీతో పోజులిస్తున్న ఈయన పేరు ఉదయన్ భోంస్లే, మహారాష్ట్ర ఎంపీ. ఎన్సీపీకి చెందిన ఈ ఎంపీగారీ పోజులే.. చివరికి ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు పాట్లు తెచ్చిపెట్టాయి.

 జేమ్స్‌బాండ్‌లా తుపాకీతో పోజులిస్తున్న ఈయన పేరు ఉదయన్ భోంస్లే, మహారాష్ట్ర ఎంపీ. ఎన్సీపీకి చెందిన ఈ ఎంపీగారీ పోజులే.. చివరికి ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు పాట్లు తెచ్చిపెట్టాయి. ఇంతకీ జరిగిందేమిటంటే.. శివాజీ మహరాజు వంశానికి చెందిన     ఈ ఎంపీగారు ఇటీవల సతారాలోని ఓ చర్చిని సందర్శించడానికి వెళ్లారు. అంతలో ఏమైందో ఏమో.. తనకు సెక్యూరిటీగా వచ్చిన     ఇన్‌స్పెక్టర్ వినోద్ మానేను.. తుపాకీ ఇవ్వవయ్యా అని అడిగారు. సాక్షాత్తు ఎంపీగారే అడగడంతో చేసేది లేక ఇచ్చాడు. తర్వాత ఉదయన్ ఇలా తుపాకీతో జేమ్స్‌బాండ్‌లా పోజులిచ్చారు. అక్కడ మీడియావారు లేకపోయినప్పటికీ ఎవరో తీసిన ఈ ఫొటోలను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో పెట్టారు. దీన్ని సతారా ఎస్పీ ప్రసన్న చూసి.. విచారణకు ఆదేశించారు. ఆ గన్.. ఇన్‌స్పెక్టర్‌దని తెలియడంతో వెంటనే అతడిని సస్పెండ్ చేయడంతో పాటు రెండేళ్ల పాటు ఇంక్రిమెంట్లు ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఉదయన్ కూడా వివాదాస్పదుడే. పలు హత్య కేసుల ఆరోపణలు ఉండటంతోపాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. తరచూ వార్తల్లో ఉంటారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement