‘48 గంటల్లో దేశం విడిచిపెట్టి వెళ్లిపోండి’ | MNS Gives 48-hour ultimatum to Pakistani artists to leave India | Sakshi
Sakshi News home page

‘48 గంటల్లో దేశం విడిచిపెట్టి వెళ్లిపోండి’

Sep 23 2016 12:59 PM | Updated on Mar 23 2019 8:36 PM

‘48 గంటల్లో దేశం విడిచిపెట్టి వెళ్లిపోండి’ - Sakshi

‘48 గంటల్లో దేశం విడిచిపెట్టి వెళ్లిపోండి’

ఉడీ ఉగ్రవాద ఘటన నేపథ్యంలో ఎమ్మెన్నెస్ పాకిస్థాన్ నటీనటులు, ఆర్టిస్టులకు అల్టిమేటం జారీ చేసింది.

ముంబై: ఉడీ ఉగ్రవాద ఘటన నేపథ్యంలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) పాకిస్థాన్ నటీనటులు, ఆర్టిస్టులకు అల్టిమేటం జారీ చేసింది. వీరంతా 48 గంటల్లో ఇండియా వదిలిపెట్టి వెళ్లి పోవాలని ఎమ్మెన్నెస్ కు చెందిన చిత్రపట్ కర్మచారి సేన హెచ్చరించించింది. భారతదేశంలో నివసిస్తున్న పాకిస్థాన్ ఆర్టిస్టులు మూటముళ్లె సర్దుకుని వెళ్లిపోవాలని చిత్రపట్ సేన అమేయ్ ఖోపాక్ అన్నారు.

‘పాకిస్థాన్ నటులు, ఆర్టిస్టులు మనదేశం విడిచిపెట్టి వెళ్లిపోవడానికి 48 గంటలు సమయం ఇస్తున్నాం. ఒకవేళ వారు వెళ్లకపోతే ఎమ్మెన్నెస్ బయటకు గెంటేస్తుంద’ని అమేయ్ పేర్కొన్నారు. పాకిస్థాన్ కళాకారులకు వ్యతిరేకంగా శివసేన, ఎమ్మెన్నెస్ గతంలో పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి నేపథ్యంలోనే పాకిస్థాన్ కు చెందిన గజల్ గాయకుడు గులామ్ అలీ ఇటీవల ముంబై జరగాల్సిన తన ప్రదర్శనను రద్దు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement