రేప్ కేసులో ఆ ఎమ్మెల్యేకు బెయిల్ | MLA Raj Ballabh Yadav gets bail from Patna High Court in a rape case | Sakshi
Sakshi News home page

రేప్ కేసులో ఆ ఎమ్మెల్యేకు బెయిల్

Sep 30 2016 4:44 PM | Updated on Jul 28 2018 8:40 PM

రేప్ కేసులో ఆ ఎమ్మెల్యేకు బెయిల్ - Sakshi

రేప్ కేసులో ఆ ఎమ్మెల్యేకు బెయిల్

బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్ బల్లాబ్ యాదవ్ కు పాట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

పాట్నా: బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్ బల్లాబ్ యాదవ్ కు పాట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు ప్రధాన నిందితులలో ఎమ్మెల్యే రాజ్ బల్లాబ్ ఒకరని మహిళా పోలీస్ స్టేషన్లో 205 పేజీల ఛార్జ్ షీటు గతంలోనే దాఖలైంది. ఈ కేసులో తనకు వ్యతిరేకంగా అరెస్టు ఉత్తర్వులు జారీకావడంతో కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిన ఎమ్మెల్యే ఆ తర్వాత కోర్టులో లొంగిపోయారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఆయన పిటిషన్ ను విచారించిన పాట్నా హైకోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ తీర్పిచ్చింది.

గత ఫిబ్రవరి 6న పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడి కేసులో రాజ్ బల్లాబ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఎమ్మెల్యే వద్దకు అమ్మాయిలను పంపించే ఇద్దరు మహిళల పేర్లను కూడా ఈ ఛార్జ్ షీటులో పేర్కొన్నట్లు పాట్నా పోలీసులు తెలిపారు. నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరిపారు. బాధిత పదో తరగతి విద్యార్థిని ప్రత్యేక భద్రత మధ్య గోప్యంగా  ఓ పరీక్ష కేంద్రంలో ఎగ్జామ్స్ రాసిన విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement