పారా మిలటరీలో 76 వేల ఉద్యోగాలు

MHA Recruitment Drive For 76,500 Vacancies In paramilitary - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర పారా మిలటరీ బలగాల్లో 76,578 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు హోంశాఖ తెలిపింది. ఈ మొత్తం ఉద్యోగాల్లో 54,953 కానిస్టేబుల్‌ పోస్టులు ఉండగా, వీటిలో మహిళల కోసం 7,646 పోస్టులను కేటాయించినట్లు వెల్లడించింది. కానిస్టేబుల్‌ పోస్టుల్లో సీఆర్పీఎఫ్‌లో అత్యధికంగా 21,566 ఖాళీలు ఉండగా, బీఎస్‌ఎఫ్‌(16,984), ఎస్‌ఎస్‌బీ(8,546), ఐటీబీపీ(4,126) అస్సాం రైఫిల్స్‌(3,076) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని తెలిపింది. ఇందుకోసం స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) 2019, ఫిబ్రవరి 11 నుంచి మార్చి 11 వరకూ కంప్యూటర్‌ ఆధారిత ప్రవేశ పరీక్షను నిర్వహించనుంది.

ఇక సబ్‌ఇన్‌స్పెక్టర్‌ హోదాలో 1,073 పోస్టులు ఉండగా వాటిలో బీఎస్‌ఎఫ్‌లో 508, సీఆర్పీఎఫ్‌లో 274, ఎస్‌ఎస్‌బీలో 206, ఐటీబీపీలో 85 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు అదనంగా ట్రేడ్స్‌మెన్, హోంశాఖ, వైద్యం, పారా మెడికల్, కమ్యూనికేషన్, ఇంజనీరింగ్‌ రంగాల్లో మరో 20,086 పోస్టులను పదోన్నతుల ద్వారా హోంశాఖ భర్తీ చేయనుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top