జాబిలి తీరం : బెంజ్‌ అద్భుత ట్వీట్‌

Mercedes-Benz India Interesting tweet on Chandrayaan-2  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అద్భుత క్షణాలు మరికొద్ది గంటల్లో ఆవిష్కారం కానున్నాయి. ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ‘చంద్రయాన్- 2’ లోని విక్రమ్ ల్యాండర్ అందనంత ఎత్తా జాబిలమ్మా..సంగతేద్దో చూద్దాం రా.. అంటూ జాబిల్లిపై దిగనుంది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత 1.30 గంటలకు..అంటే సెప్టెంబరు 7న చంద్రుడిపై దిగే ప్రక్రియ మొదలుకానున్న సంగతి తెలిసిందే. 

చారిత్రా‍త్మకమైన ఆ మధుర క్షణాలపై ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో భారీ ఆసక్తి నెలకొంది. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా అనేక మంది ప్ర‌ముఖులు త‌మ ట్వీట్ల‌తో విక్ర‌మ్‌కు విషెస్‌ తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడీజ్ బెంజ్ ఇండియా సంస్థ  వినూత్నంగా స్పందించింది. చంద్ర‌యాన్ ‌2 ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపిస్తూ..భార‌త ఖ్యాతిని ఖండాంత‌రాల‌కు తీసుకెళ్లిన ఇస్రో సంస్థకు అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా అద్భుతమైన ఫోటోను ట్వీట్‌ చేసింది. సైడ్‌ మిర్రర్‌లో జాబిల్లిని చాలా దగ్గరగా ఫోకస్‌ చేసింది. ఆబ్జెక్ట్స్ ఇన్‌ద మిర్ర‌ర్ ఆర్ క్లోజ‌ర్ దేన్‌ దే అప్పియర్‌ అని  హెచ్చరించే.. మిర్రర్‌ ఫోటోతో తనదైన శైలిలో ట్వీట్‌ చేసింది.

చదవండి : ఆ క్షణాల్ని అందరూ వీక్షించండి : మోదీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top