మోడీ పర్యటన... రెచ్చిపోయిన మావోయిస్టులు | Maoists blast 2 cell towers in Gaya district | Sakshi
Sakshi News home page

మోడీ పర్యటన... రెచ్చిపోయిన మావోయిస్టులు

Mar 27 2014 9:43 AM | Updated on Oct 9 2018 2:39 PM

బీహార్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు.గయా జిల్లాలో రెండు సెల్ఫోన్ టవర్లను గురువారం తెల్లవారుజామున మావోయిస్టులు పేల్చివేశారు.

బీహార్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు.గయా జిల్లాలో రెండు సెల్ఫోన్ టవర్లను గురువారం తెల్లవారుజామున మావోయిస్టులు పేల్చివేశారు. మావోయిస్టుల విధ్వంసంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.అయితే గుజరాత్ ముఖ్యమంత్రి,బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నేడు గయా జిల్లాలో పర్యటించనున్నారు.

 

ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.మోడీ పాల్గొనున్న సభలలో భద్రత సిబ్బంది అణువణువు తనిఖీలు చేస్తున్నారు. గయా జిల్లాలో మోడీ పర్యటనను నిరసిస్తూ మావోయిస్టులు గురువారం బంద్ కు పిలుపునిచ్చారు. మోడీ పర్యటనను వ్యతిరేకిస్తు మావోయిస్టులు ఈ రోజు తెల్లవారుజామునా రెండు సెల్ ఫోన్ టవర్లు పేల్చివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement