‘రైస్ బకెట్ చాలెంజ్’ | Manju Latha Kalanidhi starts rice bucket challenge | Sakshi
Sakshi News home page

‘రైస్ బకెట్ చాలెంజ్’

Published Tue, Sep 2 2014 2:50 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

నెట్ ప్రపంచంలో నిన్న ఐస్ బకెట్ చాలెంజ్ సందడి చేస్తే... ఓ హైదరాబాదీ మొదలుపెట్టిన రైస్ బకెట్ చాలెంజ్ నేడు ఆ స్థాయిలో నెటిజన్లను సేవ దిశగా కదిలిస్తోంది.

న్యూఢిల్లీ: నెట్ ప్రపంచంలో నిన్న ఐస్ బకెట్ చాలెంజ్ సందడి చేస్తే... ఓ హైదరాబాదీ మొదలుపెట్టిన రైస్ బకెట్ చాలెంజ్ నేడు ఆ స్థాయిలో నెటిజన్లను సేవ దిశగా కదిలిస్తోంది. ఓ వ్యాధిపై ప్రచారం కోసం బకెట్ నీటిని ఒకరి తలపై కుమ్మరించేలా... ఇటీవల అమెరికాలో ఐస్ బకెట్ చాలెంజ్ ప్రారంభం కాగా, దానికి ఓ హైదరాబాదీ దేశీయ రూపునిచ్చారు. అన్నార్థులకు ఓ బకెట్ బియ్యం దానం చేయండంటూ ‘రైస్ బకెట్ చాలెంజ్’ అనే సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు హైదరాబాద్‌కు చెందిన పాత్రికేయురాలు మంజులతా కళానిధి.
 
‘‘ఓ బకెట్ బియ్యాన్ని వండి లేదా బిర్యానీని చేసి మీ ప్రాంతంలో పేదల ఆకలి తీర్చండి. ఈ సవాల్‌ను స్వీకరించలేకపోతే కనీసం ఓ వంద రూపాయల విలువైన మందులను ప్రభుత్వానికి దానంగా ఇవ్వండి’’ అంటూ మంజులత ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఈ సవాల్‌ను చూసిన చాలా మంది నెటిజన్లు వెంటనే స్పందించారు. బకెట్ బియ్యాన్ని దానం చేయడమే కాకుండా దానికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేయడం మొదలు పెట్టారు. బకెట్ బియ్యాన్ని దానం చేయడం ద్వారా పేదవారి ఆకలి తీర్చడానికి నెటిజన్లు ఉత్సాహంగా ముందుకొస్తుండడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement