పోలీసుల నిఘా మధ్య మేనల్లుడి పెళ్లి | Mafia don Dawood Ibrahim's nephew marries, with cops on vigil | Sakshi
Sakshi News home page

పోలీసుల నిఘా మధ్య మేనల్లుడి పెళ్లి

Aug 17 2016 8:30 PM | Updated on Sep 4 2017 9:41 AM

పోలీసుల నిఘా మధ్య మేనల్లుడి పెళ్లి

పోలీసుల నిఘా మధ్య మేనల్లుడి పెళ్లి

పోలీసుల నిఘా మధ్య మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం మేనల్లుడు అలిషా పార్కర్ వివాహం బుధవారం జరిగింది.

ముంబై: పోలీసుల నిఘా మధ్య మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం మేనల్లుడు అలిషా పార్కర్ వివాహం బుధవారం జరిగింది. దావూద్ చెల్లెలు హసీనా పార్కర్ కుమారుడైన అలిషా నగరంలోని వ్యాపారవేత్త షిరాజ్ ఏ కుమార్తె ఆయేషా నాగానిని పెళ్లాడాడు. దక్షిణ ముంబైలోని నాగపడా ప్రాంతంలోని రసూల్ మసీదులో జరిగిన వీరి వివాహానికి వధూవరుల కుటుంబాలకు చెందిన సభ్యులు, ఆహ్వానిత బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

బుధవారం రాత్రి జుహు ప్రాంతంలోని తులిప్ స్టార్ హోటల్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మేనల్లుడి వివాహాన్ని స్కైప్ ద్వారా దావూద్ చూసే అవకాశముందని వార్తలు వచ్చాయి. కాగా, పెళ్లికి వచ్చిన వారి కదలికలను పోలీసులు నిశితంగా గమనించారు. అతిథులు వాహనాల నంబర్లు నమోదు చేసుకున్నారు. పెళ్లి, రిసెప్షన్ కు మీడియాను అనుమతించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement