బెదిరిపోయి బోరుబావిలో పడింది | leophard slips into borewell, sends to zoo | Sakshi
Sakshi News home page

బెదిరిపోయి బోరుబావిలో పడింది

Mar 12 2016 5:53 PM | Updated on Sep 3 2017 7:35 PM

బెదిరిపోయి బోరుబావిలో పడింది

బెదిరిపోయి బోరుబావిలో పడింది

ఎరక్కపోయి వచ్చి ఇరుక్కపోయింది ఓ చిరుతపులి.

గౌహతి: ఎరక్కపోయి వచ్చి ఇరుక్కపోయింది ఓ చిరుతపులి. తన ఆవాసానికి వెళ్లే దారి మరిచిన చిరుత నేరుగా జనావాసాల్లోకి ప్రవేశించింది. దాంతో భయాందోళనలకు గురైన అక్కడి జనం ఒక్కసారిగా గట్టిగా కేకలు వేశారు. అది చూసి బెదిరిపోయిన చిరుత ప్రాణభయంతో పరుగుతీసి ప్రక్కనే ఉన్న ఓ బోరుబావిలో పడిపోయింది. ఈ ఘటన అసోం రాజధాని గౌహతిలో శనివారం చోటుచేసుకుంది.

చిరుతపులి బోరుబావిలో పడిన విషయాన్ని స్థానికులు జంతుసంరక్షణ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు చివరకు చిరుతపులిని బోరుబావిలో నుంచి బయటకు తీశారు. అనంతరం చిరుతను అసోం జంతు ప్రదర్శనశాలకు తరలించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement