ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రెండోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు.
న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రెండోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. శనివారం కేజ్రీవాల్ ఢిల్లీ ఎనిమిదో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వేదిక రామ్లీలా మైదానంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్.. కేజ్రీవాల్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. కేజ్రీవాల్ అత్యంత సన్నిహితుడు మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలను కోరారు. ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశముంది. దీంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ 67 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. బీజేపీ కేవలం మూడు స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్ బోణీ కూడా కొట్టలేకపోయింది.