పఠాన్ కోట్ లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, టాక్సీ డ్రైవర్ కుటుబం సభ్యులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించారు.
గురుదాస్ పూర్: పఠాన్ కోట్ లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, టాక్సీ డ్రైవర్ కుటుంబ సభ్యులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
చాక్ షరీఫ్, ఝుండా గురజాన్ గ్రామాలకు వెళ్లి హావిల్దార్ కుల్వంత్ సింగ్, ఫతేహ్ సింగ్, టాక్సీ డ్రైవర్ ఇకాగర్ సింగ్ కల్వంత్ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. అన్నివిధాలా అండగా ఉంటామని వారికి భరోసాయిచ్చారు. అమరవీరులకు నివాళి అర్పించారు.