‘బిర్యానీ కాదు..బుల్లెట్‌ దించాలి’

Karnataka BJP Minister Supports Anurag Thakur Over His Comments - Sakshi

బెంగళూర్‌ : సీఏఏను వ్యతిరేకిస్తూ సాగుతున్న ఆందోళనల నేపథ్యంలో బీజేపీ మంత్రులు, సీనియర్‌ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతుంటే తాజాగా కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వైఖరికి తాను మద్దతిస్తానంటూ జాతి విద్రోహులకు బిర్యానీ కాదు బుల్లెట్‌ రుచిచూపాలని కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి సీటీ రవి అన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ పాల్గొన్న ర్యాలీలో జాతి విద్రోహులను కాల్చిపారేయాలనే నినాదాలు మిన్నంటిన క్రమంలో ఈ వివాదంపై కర్ణాటక మంత్రి సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ దుమారం రేపుతోంది.

జాతి విద్రోహులపై అనురాగ్‌ ఠాకూర్‌ ప్రకటనను వ్యతిరేకిస్తున్నవారిపై మంత్రి మండిపడ్డారు. ఉగ్రవాదులు అజ్మల్‌ కసబ్‌, యాకూబ్‌ మెనన్‌ల మృతిని వ్యతిరేకిస్తూ, తుక్డే తుక్డే గాయంగ్‌ను సమరిస్తూ, సీఏఏపై దుష్ప్రచారం సాగిస్తున్నవారే అనురాగ్‌ ఠాకూర్‌ ప్రకటనతో విభేదిస్తున్నారని నిప్పులు చెరిగారు. జాతి వ్యతిరేకులకు బిర్యానీ తినిపించడం కాదని, వారికి బుల్లెట్‌ రుచిచూపాలని మంత్రి రవి ట్వీట్‌ చేశారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనురాగ్‌ ఠాకూర్‌ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది.

చదవండి : సీఏఏపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top