కరీం తెల్గీ కన్నుమూత | Karim Telgi Passes Away | Sakshi
Sakshi News home page

కరీం తెల్గీ కన్నుమూత

Oct 26 2017 5:29 PM | Updated on Oct 26 2017 7:28 PM

Karim Telgi Passes Away

సాక్షి, బెంగళూర్‌ :  నకిలీ స్టాంపుల కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారి అబ్దుల్‌ కరీం తెల్గీ కన్నుమూశాడు. గత కొంత కాలంగా వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో తెల్గీ బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే అతన్ని బెంగళూర్‌ లోని విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందజేస్తున్నారు కూడా. 

కాగా, వేల కోట్లకు సంబంధించిన నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణంలో నిందితుడిగా ఉన్న తెల్గీని అజ్మీర్ లో నవంబర్ 2001లో తెల్గీని అరెస్ట్ చేశారు. దోషిగా తేలటంతో కోర్టు 30 సంవత్సరాల కఠిన శిక్ష విధించగా.. అప్పటి నుంచి బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఆయన్ను ఉంచారు. అంతేకాదు రూ. 202 కోట్ల జరిమానాను విధించింది కూడా. ఆ మధ్య ఈయనకు జైల్లోనే చికిత్స అందించారంటూ జైళ్ల మాజీ డీఐజీ రూప ఆరోణలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement