ఇంటి మాస్క్‌లకు మార్గదర్శకాలు 

Indian Government Scientific Advisor Guidelines For Making Masks - Sakshi

న్యూఢిల్లీ: మాస్క్‌ల కొరతని అధిగమించేందుకూ, నాణ్యమైన మాస్క్‌లను ఇంటిలోనే తయారుచేసుకునేందుకు ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇంట్లోనే అందుబాటులో ఉండే టీ షర్టు, బనియన్, చేతిరుమాళ్ళ లాంటి, వాడిన గుడ్డలతో నాణ్యమైన మాస్క్‌లను తయారుచేయవచ్చునని, ఇవి 70 శాతం ప్రభావవంతంగా పనిచేస్తాయనీ, కరోనా  వ్యాప్తిని అడ్డుకోవడానికి ఉపకరిస్తాయని ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు కార్యాలయం మంగళవారం వెల్లడించింది. మాస్క్‌లను నీళ్ళు, సబ్బు, ఆల్కహాల్‌లలో శుభ్రపరిచి, ఎండలో ఆరబెట్టాక వాడాలన్నారు. నూలువస్త్రంతో, రెండు పొరలతో తయారుచేసిన మాస్క్‌ సూక్ష్మ పదార్థాలను సైతం శరీరంలోకి ప్రవేశించనివ్వదు. ఈ మాస్క్‌లను తయారుచేసే ముందు గుడ్డలను శుభ్రంగా ఉతికి, ఉప్పు కలిపిన నీటిలో ఐదు నిమిషాల పాటు ఉడికించి మాస్క్‌లుగా తయారుచేసుకోవాలి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top