'ఇస్లాం కోసం రాళ్లు రువ్వండి' | Hizbul charade of ‘Kashmiri nationalism’ ends as it says pelt stones for Islam | Sakshi
Sakshi News home page

'ఇస్లాం కోసం రాళ్లు రువ్వండి'

Mar 17 2017 9:23 AM | Updated on Sep 5 2017 6:21 AM

'ఇస్లాం కోసం రాళ్లు రువ్వండి'

'ఇస్లాం కోసం రాళ్లు రువ్వండి'

ఇస్లాం కోసం కశ్మీరీ యువత పోలీసులు, బలగాలపై రాళ్లు రువ్వాలంటూ హిజ్బుల్‌ మొజాహిద్దీన్‌ మిలిటెంట్‌ జకీర్‌ రషీద్‌ భట్‌ పిలుపునిచ్చాడు.

శ్రీనగర్‌: ఇస్లాం కోసం కశ్మీరీ యువత పోలీసులు, బలగాలపై రాళ్లు రువ్వాలంటూ హిజ్బుల్‌ మొజాహిద్దీన్‌ మిలిటెంట్‌ జకీర్‌ రషీద్‌ భట్‌ పిలుపునిచ్చాడు. గత ఏడాది హిజ్బుల్‌ మిలిటెంట్‌ బుర్హాన్‌ వానీని బలగాలు మట్టుపెట్టిన విషయం తెలిసిందే. బుర్హాన్‌ స్ధానంలోకి వచ్చిన రషీద్‌.. కశ్మీరీల నేషనిలిజం కోసం మిలిటెంట్ల ఉద్యమం ప్రారంభమైందనే వ్యాఖ్యలను కొట్టిపడేశాడు. సెక్యులారిటీ, ఫ్రీడమ్‌ లాంటి పదాలకు మిలిటెన్సీలో చోటే లేదని హురియత్‌ కశ్మీర్‌ యువతలో అలాంటి భ్రమలు కలిగిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
 
ఇందుకు సంబంధించిన రషీద్‌ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. మొత్తం 12 నిమిషాల పాటు మాట్లాడిన రషీద్‌.. ఇస్లాం పేరిట దాడులు చేయాలని అన్నాడు. కశ్మీర్‌లో త్వరలో జరగనున్న ఉపఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయకుండా బహిష్కరించాలని కోరాడు. రాళ్లు ఒకరికోసం రువ్వుతున్నట్లు భావించకుండా ఇస్లాం కోసం చేస్తున్నట్లు భావించాలని అన్నాడు. ఏదో ఒక రోజు కశ్మీర్‌ వ్యాలీలో ఇస్లాం జెండా రెపరెపలాడుతుందని వ్యాఖ్యానించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement