
సాక్షి, బెంగళూరు: బహుభాషా నటుడు కమల్ హాసన్‌తో రాష్ట్ర డీఐజీ రూపా మౌద్గిల్ తీసుకున్న ఫోటో ఆమె ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. కమల్ హాసన్‌తో ఫోటో ఎందుకూ? అని కొందరు నెటిజన్లు విమర్శించగా, మరికొందరు అభినందించారు. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జరిగిన అక్రమాల ను బయటకి తీయడం, తరువాత ఆమె ట్రాఫిక్ విభాగానికి బదిలీ కావడం తెలి సిందే. కమల్ ఫోటోపై వచ్చిన వ్యతిరేక కామెంట్లపై రూపా స్పందిస్తూ ‘మనిషి సంఘజీవి, సోషల్ మీడియాలో ఉన్నప్పుడు, అందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. కమల్‌హాసన్‌తో నేను దిగిన ఫోటో గురించి అనసవరమైన చర్చలు పెట్టవద్దు’ అని ఆమె అన్నారు.