రాఖీలపై మోదీ, ఆదిత్యనాథ్‌ల ఫోటోలు | Gold Rakhis With Faces Of PM Modi And Yogi Adityanath | Sakshi
Sakshi News home page

Aug 25 2018 8:47 AM | Updated on Aug 25 2018 8:56 AM

Gold Rakhis With Faces Of PM Modi And Yogi Adityanath - Sakshi

గాంధీనగర్‌: సోదర ప్రేమకు ప్రతీక రక్షాబంధన్‌. ఆదివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇప్పటికే షాపింగ్‌ సెంటర్లు, బంగారు దుకాణాలు, స్వీట్‌హౌస్‌లకు పండుగ కల వచ్చేసింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు వినూత్న ఆఫర్లు, వివిధ వెరైటీలతో వ్యాపరస్తులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బంగారు పూత మిఠాయిలు, సిల్వర్‌ స్వీట్స్‌ వంటి వెరైటీలు మార్కెట్‌లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సూరత్‌లోని బంగారు దుకాణం యజయాని ఇలాంటి విభన్న ప్రయత్నమే చేశాడు. 

ప్రధాని నరేంద్రమోదీ, యూపీ యోగి ఆదిత్యనాథ్, గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీల చిత్రాలతో కూడిన బంగారు రాఖీలను తయారు చేయించాడు. ఇప్పడు గుజరాత్‌లో  వీటికి యమా క్రేజ్‌ వచ్చేసింది. తమ అభిమాన నాయకుల ఫోటోలతో కూడిన రాఖీలకోసం ఆర్డర్‌ ఇచ్చి మరీ తయారు చేయించుకుంటున్నారని షాప్‌ యజమాని పేర్కొంటున్నారు. ‘ ప్రధాని నరేంద్ర మోదీలాగా నా తమ్ముడు కూడా గొప్పవాడు కావాలనే ఉద్దేశంతో ఆయన చిత్రం ఉన్న రాఖీ కావాలని ఆర్డర్‌ చేశానని’ ఓ సోదరి వివరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement