సగటు జీవికి ఊరట..

Fuel Prices Across The Country Witnessed Yet Another Reduction - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భగ్గుమంటున్న ఇంధన ధరలు ఆదివారం వరుసగా రెండోరోజు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ లీటర్‌కు 25 పైసలు తగ్గి రూ 81.74 పలికింది. డీజిల్‌ ధర లీటర్‌కు 17 పైసలు పతనమై రూ 75.19గా నమోదైంది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర స్వల్పంగా దిగివచ్చి రూ 86.90కి తగ్గింది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ లీటర్‌కు 25 పైసలు తగ్గి రూ 87.21గా నమోదైంది. డీజిల్‌ ధర లీటర్‌కు 18 పైసలు దిగివచ్చి రూ 78.82కు తగ్గింది.

కాగా గతవారం అంతర్జాతీయ, దేశీయ దిగ్గజ చమురు కంపెనీల టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నేపథ్యంలో ఇంధన ధరలు దిగిరావడం గమనార్హమని ఇంధన నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు మం‍డుతున్న ఇంధన ధరలను నియంత్రించేందుకు పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని ఈనెల 4న ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తగ్గించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇంధన ధరలపై పన్ను భారాన్ని తగ్గించాలని ఆయన కోరారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top