రోహిత్ది సంస్థాగత హత్య | FTII students sit on hunger strike Pune, | Sakshi
Sakshi News home page

రోహిత్ది సంస్థాగత హత్య

Jan 19 2016 2:28 PM | Updated on Jul 26 2019 5:38 PM

హిత్ ఆత్మహత్య చేసుకోలేదని, ఇది సంస్థాగత హత్య అని ఎఫ్టీఐఐ విద్యార్థి సంఘం అధ్యక్షుడు హరిశంకర్ ఆరోపించారు

పుణె:   హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఉద్రిక్తతను రాజేసిన రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్యపై పుణె  విద్యార్థులు స్పందించారు. ఎనిమిదిమంది  విద్యార్థులు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు.  రోహిత్ ఆత్మహత్య చేసుకోలేదని, ఇది  సంస్థాగత హత్య అని  విద్యార్థి సంఘం  అధ్యక్షుడు హరిశంకర్ ఆరోపించారు.  ఈ సంఘటన చాలా దురదృష్టకరమన్నారు. యూనివర్శిటీల్లో విద్వేష రాజకీయాలకు  పాల్పడుతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా  దేశవ్యాప్తంగా   విద్యార్థులు  ఉద్యమించాలని ఆయన కోరారు.

రోహిత్ అకాల మరణానికి నిరసనగా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి మంచి స్పందన లభించింది.   మొదట ఎనిమిది మందితో మొదలైన ఆందోళనకు  మరింత మంది విద్యార్థులు  తోడయ్యారు.  విశ్వవిద్యాలయం విద్యార్థి  ఆత్మహత్యకు నిరసనగా  ఆందోళనచేస్తున్న  ఉద్యమకారులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

హైదరాబాద్  యూనివర్శిటీ విద్యార్థులు చేపట్టిన  ఉద్యమానికి  మద్దతు తెలిపిన  విద్యార్థి నేతలు కులమత  వివక్షలకు తావులేకుండా  నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. ఉద్యమాన్ని అణచివేయడానికి  ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను  వారు తీవ్రంగా  ఖండించారు.  విద్యార్థుల్లో విద్వేషాలను రెచ్చగొడ్డుతున్న  భావజాలానికి వ్యతిరేకంగా అందరం  పోరాడాల్సిన  అవసరం ఉందన్నారు.

కాగా గత సంవత్సరం ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా టీవీనటుడు, బీజేపీ సభ్యుడు గజేంద్ర చౌహాన్ నియామకం నిరసనగా 139 రోజుల పాటు సమ్మె నిర్వహించారు. ఈ  సందర్భంగా విద్యార్థులపై పలు నమోదు కేసులు నమోదయ్యాయి.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement