breaking news
FTII students
-
రోహిత్‌ది సంస్థాగత హత్య
పుణె: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఉద్రిక్తతను రాజేసిన రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్యపై పుణె విద్యార్థులు స్పందించారు. ఎనిమిదిమంది విద్యార్థులు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. రోహిత్ ఆత్మహత్య చేసుకోలేదని, ఇది సంస్థాగత హత్య అని విద్యార్థి సంఘం అధ్యక్షుడు హరిశంకర్ ఆరోపించారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమన్నారు. యూనివర్శిటీల్లో విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు ఉద్యమించాలని ఆయన కోరారు. రోహిత్ అకాల మరణానికి నిరసనగా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి మంచి స్పందన లభించింది. మొదట ఎనిమిది మందితో మొదలైన ఆందోళనకు మరింత మంది విద్యార్థులు తోడయ్యారు. విశ్వవిద్యాలయం విద్యార్థి ఆత్మహత్యకు నిరసనగా ఆందోళనచేస్తున్న ఉద్యమకారులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. హైదరాబాద్ యూనివర్శిటీ విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి మద్దతు తెలిపిన విద్యార్థి నేతలు కులమత వివక్షలకు తావులేకుండా నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వారు తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల్లో విద్వేషాలను రెచ్చగొడ్డుతున్న భావజాలానికి వ్యతిరేకంగా అందరం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కాగా గత సంవత్సరం ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా టీవీనటుడు, బీజేపీ సభ్యుడు గజేంద్ర చౌహాన్ నియామకం నిరసనగా 139 రోజుల పాటు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులపై పలు నమోదు కేసులు నమోదయ్యాయి. -
కీలక వ్యవస్థలను దెబ్బతీస్తున్నారు
మోదీ ప్రభుత్వంపై రాహుల్ ధ్వజం * ఆరెస్సెస్ పథకంలో భాగంగా కాషాయీకరణ చేస్తున్నారు.. * ఎఫ్టీఐఐ చైర్మన్ గజేంద్రను తొలగించాలని డిమాండుకు మద్దతు పుణే: ఆరెస్సెస్ పథకంలో భాగంగానే భారత చలనచిత్ర, టెలివిజన్ ఇన్స్టిట్యూట్ సంస్థ (ఎఫ్టీఐఐ)కు చైర్మన్‌గా గజేంద్ర చౌహాన్‌ను నియమించారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆరెస్సెస్ ప్రోద్బలంతోనే కేంద్రం కీలకమైన విద్యా, పరిపాలన, న్యాయ వ్యవస్థల పునాదులను దెబ్బతీస్తోందని, వీటిని కాషాయీకరిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఎఫ్టీఐఐ క్యాంపస్‌ను సందర్శించి గజేంద్ర చౌహాన్‌ను తొలగించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. చౌహాన్‌ను తప్పించాలని డిమాండ్ చేశారు. కీలకమైన వ్యవస్థల్లో ఆరెస్సెస్ భావజాలంగల వ్యక్తులను నింపుతున్నారని, అదేమని ప్రశ్నిస్తే జాతివ్యతిరేకులని, హిందూ వ్యతిరేకులంటూ ఎదురుదాడి చేస్తున్నారని రాహుల్ అన్నారు. విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుండా, వారిని అణచివేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. తమ వాదన కూడా వినాలని విద్యార్థులు కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు. సమాజానికి రాబోయే రోజుల్లో సందేశాత్మక చిత్రాలు అందించే విద్యార్థులను అణచివేయడం సరికాదని అన్నారు. గజేంద్ర చౌహాన్ తమకు వద్దని విద్యార్థులు చెబుతుంటే ఆయనను బలవంతంగా ఎందుకు రుద్దుతారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో ఏదైనా సమస్య వస్తే చర్చలద్వారా దానిని పరిష్కరించేవారిమని, ఇప్పుడు ప్రధాని మోదీ ఒక నిర్ణయం తీసుకుంటే ఇక దాన్ని ప్రశ్నించకూడదంటున్నారని రాహుల్ అన్నారు. ఎఫ్టీఐఐ చైర్మన్ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతానని ఆయన విద్యార్థులకు హామీనిచ్చారు. బీజేపీ సభ్యుడు, టీవీ నటుడైన చౌహాన్‌ను ఎఫ్టీఐఐ చైర్మన్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు గత 50 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మహాభారత్ టీవీ సీరియల్లో చౌహాన్ ధర్మరాజు పాత్రను పోషించారు. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులు సల్మాన్ ఖాన్, అనుపమ్ ఖేర్ తదితరులు చౌహాన్‌ను తొలగించాలన్న డిమాండ్‌కు మద్దతు పలికారు. కాగా, రాహుల్ రాక సందర్భంగా క్యాంపస్ బయట బీజేపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనకు దిగారు.